నిర్మాతలంటే దర్శకులకు భయం ఉండాలి.. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్‌ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 11) ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.

నిర్మాతలంటే దర్శకులకు భయం ఉండాలి.. కొరియన్ కనకరాజు సక్సెస్‌ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi

Updated on: Aug 11, 2026 | 8:23 PM

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ హర్రర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా సాధించడంతో ఈ చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఆగస్టు 11) హైదరాబాద్ వేదికగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి దర్శకులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ కొరియన్ కనకరాజు చూసినపుడే దీని గురించి మాట్లాడాలని ఉత్సాహంగా ఉన్నా. వరుణ్ తేజ్‌ను నేనే అడిగాను మాట్లాడతాను అని. ఓ సినిమా విజయం వస్తే చాలా మంది జేబుల్లోకి డబ్బులు వస్తాయి.. అది జరగాలి. ఈ సినిమా సక్సెస్‌కు ప్రధానమైన కారణం దర్శకుడు, రైటర్.. మేర్లపాక గాంధీ గారు ఈ విషయంలో విజయం సాధించారు. దర్శకుడి బాధ్యత చాలా ఉంటుంది. ఈ సినిమాకు ఆర్థికంగా, మరే ఇతర ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొరియన్ కనకరాజును విజయవంతంగా పూర్తి చేసారు మేర్లపాక గాంధీ. ఎంతోమంది రెస్పాన్సిబిలిటీ మనసులో పెట్టుకుని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ చూసినపుడు కొత్త పాయింట్ తీసుకున్నారు. హార్రర్ కామెడీలు చాలా వచ్చాయి. కానీ కొరియన్ ఫ్లేవర్ పెట్టడం మంచి థాట్. ప్రతీ వాళ్లు కొరియన్ సినిమాలు, సిరీస్ లు చూస్తున్నారు. అలాంటిది మన సినిమాల్లో మెర్జ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కొరియన్ కనకరాజు చూపించింది. సేఫ్ జోన్ కాకుండా వైవిధ్యంగా ప్రయత్నించాడు వరుణ్ తేజ్. ప్రతీ సినిమాలో ఏదో ఓ ప్రయోగం చేస్తుంటాడు. స్టార్‌గా ఎదగాలనే తాపత్రయం కంటే నటుడిగా ఎదగాలనుకుంటాడు వరుణ్. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నీ వరకు నువ్వు విజయం సాధిస్తూనే ఉంటావు.. వర్సటైల్ యాక్టర్‌గా ఎదుగుతావు. వరుణ్ ఇది నీ సక్సెస్ కాదు.. మన బుడ్డోడు వాయువ్ ఖాతాలో వేసేయ్.. వాడు వచ్చాడు నీకు లక్ వచ్చింది.. వాయువ్ మా లక్కీ ఛామ్’

‘ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి మరో కారణం సత్య.. ఈ సినిమాలో నువ్వు చాలా బాగా చేసావ్.. నీకోసం సినిమా మరోసారి చూడాలనిపించేంత బాగా చేసావ్.. క్యారెక్టర్ పరంగా హద్దులు లేకుండా మనసుకు ఏది అనిపిస్తే అది అల్లుకుంటూ వెళ్లిపోతుంటావు.. అదే నీ బలం. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను సత్య. రితికా నాయక్ చాలా బాగా నటించింది. చాలా లిమిటెడ్ బడ్జెట్‌లో కొరియన్ కనకరాజు సినిమా తీసారు. చాలా మంది దర్శకులు దీన్ని చూసి నేర్చుకోవాలి. భారీగా ఖర్చు పెడితేనే సినిమాలు కాదు. మైండ్‌లో అనుకోవాలి దర్శకులు. ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. ఎక్సర్‌సైజ్ చేసుకోవాలి. నిర్మాతలు బతకాలనే భయం భక్తి ఉండాలి. నిర్మాతలను నలిపేసి తన పేరు మాత్రమే ఉండాలనుకోకూడదు. తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేసేలా ఉండాలి. బిఫోర్ బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేసేలా ఉండాలి. ప్రతీ వాళ్లు ఇది ఆలోచించాలి. 2026 ఫస్టాఫ్ మంచి సినిమాలు వచ్చాయి. సెకండాఫ్‌లో మాత్రం పెద్ది సినిమా హిట్ అవ్వడం, తర్వాత లెనిన్, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, ఇప్పుడు కొరియన్.. అన్నీ వస్తున్నారు. ఈవెంట్ ఫిల్మ్స్ తప్ప జనాలు రారు అంటారు.. కానీ కంటెంట్ ఇవ్వగలిగితే వస్తారు. సినిమా బాగుంది అంటే థియేటర్లకు వస్తారు’అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us