Bhola Shankar Trailer: దుమ్మురేపిన భోళా బాయ్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే

తాజాగా భోళా శంకర్ సినిమాతో రాబోతున్నారు మెగాస్టార్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించనుంది.

Bhola Shankar Trailer: దుమ్మురేపిన భోళా బాయ్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే
Bhola Shankar

Updated on: Jul 27, 2023 | 4:50 PM

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్. వరుస సినిమాలు లైనప్ చేసిన చిరు.. ఆయా  సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా భోళా శంకర్ సినిమాతో రాబోతున్నారు మెగాస్టార్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించనుంది. అలాగే అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కుస్తున్నారు దర్శకుడు మెహర్ రమేష్. ఈ మూవీలో చిరు మరింత స్టైలిష్ గా కనిపించనున్నారు

తాజాగా విడుదలైన భోళా శంకర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ స్వాగ్ , యాక్షన్ సీన్స్ ఈ ట్రైలర్ లో చూపించారు. అలాగే చిరు చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్, పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి.

ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టిన చిరు.. భోళా శంకర్ సినిమాతో మరో హిట్ ను కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ భోళా శంకర్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి