Chandrasekhar Yeleti: వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. నితిన్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడా..

తీసింది కొన్ని సినిమాలే అయినా.. ఆ సినిమాలన్నింటితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చంద్రశేఖర్ ఏలేటి. తన కథలతో.. కథలను నడిపించే తీరుతో టాలీవుడ్ డైరెక్టర్లందరిలో

Chandrasekhar Yeleti: వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. నితిన్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడా..
Prabhas

Updated on: May 13, 2021 | 10:44 PM

Chandrasekhar Yeleti:

తీసింది కొన్ని సినిమాలే అయినా.. ఆ సినిమాలన్నింటితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చంద్రశేఖర్ ఏలేటి. తన కథలతో.. కథలను నడిపించే తీరుతో టాలీవుడ్ డైరెక్టర్లందరిలో ప్రత్యేకంగా నిలిచారు కూడా. ఇక బుల్లి తెరపై “అమృతం” సీరియల్‌తో దర్శకుడిగా మారి.. “ఐతే” సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు యేలేటి. ఇటీవల నితిన్ కలిసి చెక్ అనే సినిమా చేసాడు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. థియేట్రికల్ రన్‌లో ఫెయిల్ అయిన ఈ సినిమా మే 14న సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది . ఇదిలా ఉంటే.. ఈ సెన్సబుల్ డైరెక్టర్‌ తాజాగా పాన్ ఇండియా స్టార్‌ ప్రభాసం కోసం ఓ స్టోరీని సిద్దం చేసే పనిలో పడ్డారట. పాన్ ఇండియా లెవల్లో డార్లింగ్ ప్రభాస్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్టయ్యే విధంగా ఈ స్టోరీని రెడీ చేస్తున్నారట. ఇక కథ మొత్తం పూర్తయ్యాకే ప్రభాస్‌కు నెరేట్ చేస్తారట యేలేటి.

ఇక ఇప్పటికే చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకండా గడుపుతున్నారు ప్రభాస్‌. ఓవైపే రాధేశ్యామ్‌.. మరో వైపు సలార్‌, ఆదిపురుష్, నాగ్ అశ్విన్‌ సినిమాలతో 2025 వరకు మోస్ట్‌ బిజీఎస్ట్ పర్సన్‌గా మారిపోయారు. అయితే ఈ సినిమాలన్నింటినీ ప్రభాస్‌ ఫినిష్ చేసేవరకు చంద్రశేఖర్‌ యేలేటి వెయిట్ చేస్తారో లేక మధ్యలోనై మరో హీరోతో పట్టాలెక్కిస్తారో చూడాలి మరి!

మరిన్ని ఇక్కడ చదవండి :

Chatrapathi Hindi Remake: ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఈ వార్త‌లో అయినా నిజం ఉందా.!

Actress Meena: కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏంచేయాలో చెప్పిన సీనియర్ నటి..

Sonu Sood: తారాస్థాయికి సోనూ ఇమేజ్‌.. విలన్‌గా చూపించేందుకు భయపడుతున్న మేకర్స్‌ !