Ram Charan: రామ్ చరణ్‌తో కలిసి నటించాలనుకుంటున్నారా? ‘RC 17’ నుంచి క్యాస్టింగ్ కాల్.. పూర్తి వివరాలివే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'ఆర్ సీ 17' ( వర్కింగ్ టైటిల్) నటీనటుల ఎంపిక కోసం అనౌన్స్ మెంట్ వెలువడింది.

Ram Charan: రామ్ చరణ్‌తో కలిసి నటించాలనుకుంటున్నారా? RC 17 నుంచి క్యాస్టింగ్ కాల్.. పూర్తి వివరాలివే
Ram Charan, Sukumar

Updated on: Nov 27, 2026 | 6:28 PM

ఈ ఏడాది ప్రారంభంలో పెద్ది సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు చరణ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఆర్ సీ 17 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ మెగా మూవీని కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం చిత్రబృందం నటీనటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఈ సినిమాలో నటించాలని ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాన్ని కల్పిస్తూ మేకర్స్‌ అధికారికంగా ఆడిషన్స్‌కు పిలుపునిచ్చారు. ‘ఒక కొత్త ప్రపంచం.. ఒక కొత్త కథ.. బహుశా ఒక పాత్ర మీ కోసమే ఎదురుచూస్తుండవచ్చు” అంటూ ఆర్ సీ 17 చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాలో విభిన్న పాత్రల కోసం 16 నుంచి 60 వయస్సు గ‌ల‌ నటీనటులను ఎంపిక చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ తెలిపాయి. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు తమ నటనా ప్రతిభను చాటే ఆడిషన్ వీడియోలు, ప్రొఫైల్ వివరాలను src17casting@gmail.com అనే ఈ-మెయిల్ ఐడీకి గానీ, లేదా 9110564651 అనే వాట్సాప్ నంబర్‌కు గానీ పంపించాలని మేకర్స్ సూచించారు

కాగా రంగస్థలం సినిమాను మించి ఆర్ సీ 17 ను తెరకెక్కించాలనే యోచనలో ఉన్నారు మేకర్స్. ముఖ్యంగా పుష్ప2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ ఎలాంటి సినిమా తీస్తారోనని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మెగా మూవీలో నటించే హీరోయిన్ విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట కియారా అద్వానీ అనుకున్నారు.. ఆ తర్వాత ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి ఈ మెగా మూవీలో కథానాయికగా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

ఆర్ సీ 17 క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us