Tollywood : ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు.. కానీ వరుస ఆఫర్స్.. కారణం ఇదేనా..

|

Sep 26, 2024 | 7:27 PM

కొంతమంది ఓవర్ నైట్‌లో స్టార్స్ అవుతున్నారు. మరికొంతమంది వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హాట్ బ్యూటీ కూడా అంతే.. అందం అభినయం ఉన్న ఈ వయ్యారి.. తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కుర్రకారు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు.

Tollywood : ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు.. కానీ వరుస ఆఫర్స్.. కారణం ఇదేనా..
Tollywood
Follow us on

రీసెంట్ డేస్ లో చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్‌లోకి పరిచయం అవుతున్నారు. కొంతమంది ఓవర్ నైట్‌లో స్టార్స్ అవుతున్నారు. మరికొంతమంది వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హాట్ బ్యూటీ కూడా అంతే.. అందం అభినయం ఉన్న ఈ వయ్యారి.. తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కుర్రకారు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. ఆమె కోసమే సినిమాకు వెళ్లే వారు.. ఓటీటీలో ఆమె సినిమాను పదే పదే చూసేవారు కూడా ఉన్నారు. అంతలా తన అందంతో ఆకట్టుకుంది ఆ బ్యూటీ.. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె నటించిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటీ కూడా హిట్ కాలేదు. కానీ ఆమెకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయ్.. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!

వరుస సినిమాలు ఫ్లాప్ అయితే చాలా మంది మెల్లగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగవుతూ ఉంటారు.. కానీ ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం .. ఆమె అందాలు. చాలా మంది ముద్దుగుమ్మలు నటనతో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది తమ అందచందాలతో హైలైట్ అవుతూ ఉంటారు వారిలో ఈ బ్యూటీ ఒకరు.. ఆమె కావ్య థాపర్.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

కావ్య థాపర్ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా ఏక్ మినీ కథ, ఊరు పేరు భైరవకోన, ఈగల్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాల్లో తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. సినిమాలు ఫ్లాప్ అయినా ఈ అమ్మడికి మాత్రం మంచి డిమాండ్ ఏర్పడింది. అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. టాలీవుడ్ లో గ్లామరస్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కావ్య థాపర్. ఈ రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న విశ్వం సినిమాలో చేస్తోంది. అలాగే ఈ భామ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: వైల్డ్ కార్డు ఎంట్రీ ప్లాన్ అదిరిందిగా..! హౌస్‌లోకి ముగ్గురు హాట్ బ్యూటీలు..

కావ్య థాపర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.