Tollywood : అమ్మాయి కాదు భయ్యా.. ఇండస్ట్రీలోనే తోపు హీరో.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో గుర్తుపట్టారా.. ?

చిన్నప్పుడు అందమైన యువరాణిలా కనిపిస్తుంది. కానీ ఆమె హీరోయిన్ కాదు.. తోపు హీరో. అప్పట్లో సౌత్ అడియన్స్ లవర్ బాయ్. శాస్త్రీయ నృత్యంతో అందరి మనసులు గెలుచుకున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత సహయ నటుడిగా కనిపించిన ఆయన.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఎంతో మందికి నాట్యం నేర్పిస్తున్నారు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood : అమ్మాయి కాదు భయ్యా.. ఇండస్ట్రీలోనే తోపు హీరో.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Vineeth

Updated on: Aug 03, 2026 | 6:53 AM

డ్యాన్స్ కాస్ట్యూమ్‌లో నవ్వుతున్న ఈ అందమైన అమ్మాయిని మీరు గుర్తుపట్టారా.. ? అవును.. అందమైన రూపం.. ఆకట్టుకునే చిరునవ్వుతో అందరి మనసులు హృదయాలు గెలుచుకుంటుంది. ఆ నవ్వుతోనే ఆమెను గుర్తుపట్టవచ్చు. కానీ మీరు అనుకుంటున్నట్లు ఆమె అమ్మాయి కాదండి. అబ్బాయి. దక్షిణాదిలో ఒకప్పుడు తమిళ చిత్రసీమలో రొమాంటిక్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు. రజనీకాంత్, శరత్‌కుమార్, నెపోలియన్, మాధవన్ పార్థిబన్ వంటి ఎందరో నటులతో కలిసి నటించారు. నిజానికి తమిళంలో తోపు హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు మరెవరో కాదు. కోలీవుడ్ హీరో వినీత్. తన చిన్ననాటి ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ “ఈ చిన్న నర్తకుడు ఎవరో ఎవరైనా ఊహించగలరా?” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు నెట్టింట ఆ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

1992లో విడుదలైన ‘ఆవరంభూ’ చిత్రంతో తమిళ చిత్రసీమలో అరంగేట్రం చేసిన వినీత్, అప్పటి నుండి ‘జాతి మళ్ళీ’, అర్జున్‌తో ‘జెంటిల్‌మన్’, శరత్‌కుమార్‌తో ‘సిమ్మరసి’, నెపోలియన్‌తో ‘కరిసక్కట్టు పూవే’, రజినీతో ‘చంద్రముఖి’, ‘శక్తి’, ‘మే మధం’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ముఖ్యంగా అబ్బాస్, వినీత్ కలిసి నటించిన కాదల్ దేశం చిత్రాన్ని తెలుగులో ప్రేమదేశం పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగులో నీ ప్రేమకై సినిమాలోనూ నటించారు. తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి ఇతర భాషలలో కూడా అనేక నటించిన వినీత్.. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ సుపరిచితమే.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

వినీత్ నృత్యం, నటన రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. వినీత్ కేరళలోని తలస్సేరిలో ఉన్న సెయింట్ జోసెఫ్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ప్రముఖ నర్తకి, సినీ నటి శోభనకు బంధువైన వినీత్, తన పాఠశాల రోజుల నుంచే భరతనాట్యంలో అనేక బహుమతులు గెలుచుకున్నాడు. అతను రాష్ట్ర పాఠశాల యువజనోత్సవంలో జరిగిన భరతనాట్య పోటీలో వరుసగా 4 సార్లు మొదటి స్థానం గెలుచుకున్నాడు. వినీత్ ‘కళా ప్రతిభ’ బిరుదును కూడా గెలుచుకున్నాడు. 1985లో, వినీత్ 16 ఏళ్ల వయసులో ఐ.వి. శశి దర్శకత్వం వహించిన ‘ఇతనిలంగల్’ చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం హీరోగానే కాకుండా నటుడిగా, విలన్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బిజీగా ఉంటున్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..


ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us