Anupama Parameswaran: దొండకాయ్.. బెండకాయ్.. అనుపమ ‘బటర్‌ఫ్లై’ ఓటీటీ డేట్ వచ్చిందోయ్

తెలుగునాట మంచి క్రేజ్‌ ఉన్న నటి అనుపమ. ఆమెకు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అను అంటే పడి చచ్చిపోతున్నారు కుర్రాళ్లు.

Anupama Parameswaran: దొండకాయ్.. బెండకాయ్.. అనుపమ ‘బటర్‌ఫ్లై’ ఓటీటీ డేట్ వచ్చిందోయ్
Anupama Parameswaran

Updated on: Dec 26, 2022 | 9:54 AM

దొండకాయ్.. బెండకాయ్… అనుపమ మా గుండెకాయ్.. ఇప్పుడు కుర్రాళ్లు ఎక్కువగా యూజ్ చేస్తున్న స్లోగన్ ఇదే. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ను తెలుగునాట ఫ్యాన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు. రింగురింగుల ముంగురులు ఉన్న చిన్నది.. తన అందం, అభినయంతో అలా మాయ చేస్తుంది. ఇటీవలే 18 పేజెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. త్వరలో  ‘బటర్‌ఫ్లై’ మూవీతో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీని ఘంటా సతీష్‌బాబు తెరకెక్కించారు.  ప్రసాద్‌ తిరువల్లూరి, రవిప్రకాష్‌ బోడపాటి, ప్రదీప్‌ నల్లిమెల్లి ప్రొడ్యూస్ చేశారు. భూమికా చావ్లా, రావు రమేష్‌, నిహాల్‌ ఈ మూవీలో కీ రోల్స్ చేశారు.

ఈ సినిమా డిసెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది.  తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. 2021 డిసెంబరులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్లు అనుపమ తెలిపింది. నెల రోజుల్లోనే మూవీ కంప్లీట్ చేశామని.. నిర్మాణాంతర పనుల్ని ఏడాది టైమ్‌ తీసుకొని ఎంతో క్వాలిటీతో చేసినట్లు వివరించింది. ఈ చిత్రంలో తాను గీత అనే రోల్‌లో కనిపిస్తానని వివరించింది. చాలా భావోద్వేగభరితమైన రోల్ తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది.

తనకు ఈ రోల్ చేయడం చాలా ఛాలెంజ్‌గా అనిపించిందని అనుపమ చెప్పింది. ఆద్యంతం థ్రిల్‌ పంచే ఈ సినిమా.. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరిని ఆకట్టుకుంటదని వెల్లడిచింది. అనుపమతో కలిసి పని చేయడం ఎంతో హ్యాపీగా ఉందన్నారు హీరో నిహాల్‌.  ఇదొక అద్భుతమైన మూవీ అని.. తాను విశ్వ అనే రోల్ చేసినట్లు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..