Allu Arjun: అల్లు అర్జున్ పై అసత్య ప్రచారం.. క్షమాపణలు చెప్పిన కావేరి.. పోస్ట్ వైరల్..

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలి బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్ ను బన్నీ టీమ్ ఖండించింది. ఈ క్రమంలో తాజాగా ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పుగా బయటకు వెళ్లాయని అన్నారు.

Allu Arjun: అల్లు అర్జున్ పై అసత్య ప్రచారం.. క్షమాపణలు చెప్పిన కావేరి.. పోస్ట్ వైరల్..
Allu Arjun

Updated on: Feb 17, 2026 | 2:59 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ను కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరువా చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పుగా బయటకు వెళ్లాయని… తనవల్ల సదరు హీరో గౌరవానికి భంగం కలిగి ఉంటే క్షమించాలని తెలిపారు. తాను చెప్పిన 42 రూల్స్ అనే మాట తన కల్పితమేనని అన్నారు. 42 రూల్స్ కు సంబంధించిన లిస్ట్ ఎవరు విడుదల చేశారో తనకు తెలీదని.. తాను ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. బన్నీ గురించి తాను చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. తన వ్యాఖ్యలను వాస్తవమని ఎవరూ తీసుకోవద్దని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

అల్లు అర్జున్ గురించి అలాంటి కామెంట్స్ చేసినందుకు తాను చింతిస్తున్నానని.. తన వ్యాఖ్యల పట్ల ఆయన ప్రతిష్టకు భంగం కలిగినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. తనకు బన్నీపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. ప్రస్తుతం కావేరి బరువా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

అసలు విషయానికి వస్తే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటీనటుల విషయంలో ఒక్కొక్కరికీ ఒక్క విధమైన వ్యక్తిత్వం ఉంటుందని.. బన్నీతో తాను మరో రకమైన అనుభవం ఎదుర్కొన్నానని అన్నారు. దక్షిణాది తారలను కలిసి విషయంలో ఒక పద్దతి ఉంటుందని.. హీరోలను కలవడానికి ముందు ఏం చేయాలి… ఏం చేయకూడదు అనే 42 నిబంధనలు ఉంటాయని.. ఆ విషయంలో వారి మేనేజర్స్ కఠినంగా ఉంటారని చెప్పుకొచ్చింది. హీరో సెట్ లో ఉండగా ఫోన్ ఉపయోగించకూడదు అని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు అల్లు అర్జున్ టీమ్ ఖండించింది.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

Follow Us