
Alia Bhatt : బాలీవుడ్ లో బ్యూటీ అలియా భట్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయిపోయింది. జక్కన్న చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మాత్రమే కాదు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇటీవలే సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో గంగు బాయ్ సినిమాలో నటించింది అలియా. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో అలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు అలియా బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రణబీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు అలియా పుటిన రోజు సందర్భంగా బ్రహ్మాస్త్ర సినిమానుంచి అలియాకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ట్వీట్ చేస్తూ.. ‘బ్రహ్మాస్త్ర యొక్క మొట్టమొదటి విజువల్స్ తో ఆలియా లుక్ ని షేర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఈషా పాత్రలో అలియా కనిపించనుందని మేకర్స్ పేర్కొన్నారు. విజువల్ వండర్ గా ఉన్న ఈ వీడియోలో అలియా ఎంతో గ్లామర్ గా కనిపించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :