Janhvi Kapoor: జాన్వీ పెళ్ళికి బోని కపూర్ కండీషన్.. ఆ ఒక్కటి పక్కగా ఉండాలట..

|

Jul 30, 2022 | 7:21 AM

బాలీవుడ్ లో దూసుకుపోతోన్న యంగ్ బ్యూటీస్ లో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ఒకరు. దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

Janhvi Kapoor: జాన్వీ పెళ్ళికి బోని కపూర్ కండీషన్.. ఆ ఒక్కటి పక్కగా ఉండాలట..
Janhvi Kapoor
Follow us on

బాలీవుడ్‌లో దూసుకుపోతోన్న యంగ్ బ్యూటీస్‌లో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్(Janhvi Kapoor) ఒకరు. దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలిసినిమాలో తన నటనతో కట్టిపడేసిన జాన్వీ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ అమ్మడు రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ.. ఫాలోయింగ్ ను రెట్టింపు చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు క్రేజ్ మాములుగా లేదు. హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది జాన్వీ. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనను తాను నిరూపించుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు పెళ్లి టాపిక్ బాలీవుడ్ లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

జాన్వీ తండ్రి బోని కపూర్ పెళ్లి విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారట. అయితే ఓ కండీషన్ పెట్టారట. జాన్వీ పెళ్లి చేసుకునే వ్యక్తికి ఆ క్వాలిటీ మాత్రం పక్కాగా ఉండాలట. ఇంతకు అదేంటంటే.. జాన్వీ చేసుకోబోయేవాడు బోని కపూర్ కంటే ఎత్తుగా ఉండాలట. బోనీ హాట్ 6.1 అంటే జాన్వీకి కాబోయే వాడు మినిమమ్ 6.2 ఉండాలన్నమాట. అలాగే మరో మాట కూడా చెప్పారట.. మా నాన్న మమల్ని ప్రపంచమంతా తిప్పారు అని తమకు కాబోయే వాడికి చెప్పాలట చెప్పారట.. అంటే తమకు కాబోయేవాడు తన కంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవాలని అలా చెప్పారట బోనీ. అంటే రేపు జాన్వీ ప్రేమలో పడితే మాత్రం ముఖ్యంగా హాట్ చూసుకుంటుందట.. మరి ఈ అమ్మడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి