Salman Khan : మెగాస్టార్ సినిమాలోనే కాదు ఆ స్టార్ హీరో సినిమాలోనూ నటిస్తున్నానన్న సల్మాన్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టడమే కాదు ఆయా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు మెగాస్టార్.

Salman Khan : మెగాస్టార్ సినిమాలోనే కాదు ఆ స్టార్ హీరో సినిమాలోనూ నటిస్తున్నానన్న సల్మాన్..
Salman

Updated on: Dec 02, 2021 | 10:53 AM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టడమే కాదు ఆయా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు మెగాస్టార్. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కిన ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైనా ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్ , పాటలు సినిమాపై అంచులను భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా చరణ్ , చిరు కలిసి నటించడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ , చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమా మలయాళ  సినిమా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవల అంతిమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు సల్మాన్. ఈ సందర్భంగా సల్మాన్ మీడియా తో మాట్లాడుతూ .. హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇక్కడ తనకు చాలా మంది మిత్రులున్నారని.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తనకు అత్యంత సన్నిహితుడని అన్నారు. త్వరలోనే ఆయన తో కలిసి నటించనున్నట్టు తెలిపారు. దాంతో మెగస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. గాడ్‌ఫాదర్‌  చిత్రంలో చేయమని చిరంజీవిగారు అడిగారు. పాత్ర ఏంటి? ఎన్ని రోజులు షూటింగ్‌ అని అడగకుండా సరే అన్నాను. వెంకటేశ్‌గారితో కూడా నటించబోతున్నాను అని తెలిపారు సల్మాన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అల్లు అర్జున్‌.. రూ.25 లక్షలు విరాళంగా అందించిన ఐకాన్‌ స్టార్‌..

Nikita Dutta: తలపై కొట్టి ఫోన్‌ లాక్కెళ్లారు.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న బాలీవుడ్‌ నటి..

Naga Shaurya: ఆమెను చూస్తే ఎవ్వరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుంది.. నాగ శౌర్య ఆసక్తికర కామెంట్స్

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us