
‘రాగిణి ఎంఎంఎస్ 2’ సినిమాలోని ‘బేబీ డాల్’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ తన రెండవ భర్త గౌతమ్ హతిరమాని నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2022లో లండన్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకుంటూ, ఈ కష్ట సమయంలో తన గోప్యతను గౌరవించాలని కనికా అందరినీ కోరారు. ‘మన దారులు ఇప్పుడు వేరయ్యాయి. మనం కలిసి గడిపిన క్షణాలకు నేను కృతజ్ఞురాలిని. మన భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతను గౌరవించండి’ అని కనికా కపూర్ కోరింది. అయితే
విడాకులకు గల కచ్చితమైన కారణాన్ని ఆమె వెల్లడించలేదు. చాలా సంవత్సరాలుగా గౌతమ్‌తో ప్రేమలో ఉన్న కనిక, 2022 మే 20న లండన్‌లో వివాహం చేసుకుంది. ఇది కనికా కపూర్‌కు రెండవ వివాహం. ఆమె గతంలో వ్యాపారవేత్త రాజ్ చందోక్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అయానా, సమీరా, యువరాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే 2012లో విడాకులు తీసుకున్నారు కనికా- రాజ్. ఇక భర్త నుంచి విడిపోయిన తర్వాత ఇండియాకు తిరిగొచ్చేసిన కనికా కపూర్ మళ్లీ సింగర్ గా బిజీగా మారిపోయారు.
కనికా కపూర్ ‘రాగిణి ఎంఎంఎస్- 2’లోని ‘బేబీ డాల్’పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారామె. ఆ తర్వాత లవ్లీ ‘హ్యాపీ న్యూ ఇయర్’, దేశీ లుక్ ‘ఏక్ పహేలి లీలా’, బీట్ పె బూటీ ‘ఎ ఫ్లయింగ్ జాట్’ వంటి వరుస హిట్ సాంగ్స్‌తో బాలీవుడ్ లో స్టార్ సింగర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు కనిక. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్ హిందీ వెర్షన్ ను కనికా కపూరే ఆలపించడం విశేషం. ఇటీవల హిందీలో తెరకెక్కిన ‘మేరే హస్బెండ్ కి బివి’ చిత్రంలోని ‘గోరీ హై కలైయాన్’ పాటను ఈ సింగరే పాడింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి