టీజర్ లీక్: ఇదే అరాచకం సామీ..! తమన్నా సీన్స్ మొత్తం నెట్టింట వైరల్

మీడియం రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసిందిఈ ముద్దుగుమ్మ. అప్పట్లో చాలా మందికి తమన్నా లక్కీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ వయ్యారి. ఇక ఇప్పుడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది ఈ అమ్మడు. అక్కడ వరుసగా సినిమాలు సిరీస్ లు చేస్తుంది. రీసెంట్ గానే అక్కడ ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి అందరికి షాక్ ఇచ్చింది.

టీజర్ లీక్: ఇదే అరాచకం సామీ..! తమన్నా సీన్స్ మొత్తం నెట్టింట వైరల్
Tamanna

Updated on: Jun 15, 2024 | 10:36 AM

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు సినిమాలు తగ్గించేసింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది ఈ బ్యూటీ. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసిందిఈ ముద్దుగుమ్మ. అప్పట్లో చాలా మందికి తమన్నా లక్కీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ వయ్యారి. ఇక ఇప్పుడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది ఈ అమ్మడు. అక్కడ వరుసగా సినిమాలు సిరీస్ లు చేస్తుంది. రీసెంట్ గానే అక్కడ ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తుంది.

2018లో విడుదలైన ‘స్త్రీ’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. రాజ్‌కుమార్‌రావు, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈసినిమాకు సీక్వెల్ గా స్త్రీ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన స్త్రీ సినిమా ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఇప్పుడు అంతకు మించి ఉండేలా స్త్రీ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టీజర్ లీక్ అయ్యింది.

ఇందులో తమన్నా భాటియాను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో తమన్నా భాటియా నటిస్తుందనే విషయాన్ని చిత్రబృందం వెల్లడించలేదు. ఇప్పుడు టీజర్‌లో ఆమెను చూసిన తర్వాత ‘స్త్రీ 2’పై జనాల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘స్త్రీ 2’ టీజర్ ఎలా లీక్ అయ్యిందంటే..  హారర్ స్టోరీ ‘ముంజ్యా’ సినిమా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాతో పాటు ‘స్త్రీ 2’ టీజర్‌ను థియేటర్ లో విడుదల చేశారు. కానీ టీజర్ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. సినిమా థియేటర్లలో ప్రదర్శించిన టీజర్‌ను ప్రేక్షకులు మొబైల్‌లో రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో లీక్ చేశారు.

ఆగస్ట్‌లో ‘స్త్రీ 2’ సినిమా విడుదల కానుంది. శ్రద్ధా కపూర్ దెయ్యం గెటప్‌లో అభిమానులకు షాకివ్వబోతోంది. ఈసారి శ్రద్ధా కపూర్‌తో రాజ్‌కుమార్‌రావు కాంబినేషన్‌ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొదటి భాగంలో ఉన్న పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ‘స్త్రీ 2’ చిత్రంలోనూ ఉన్నారు. అమర్ కౌశిక్ ‘స్త్రీ 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆన్‌లైన్‌లో లీక్ అయిన టీజర్ చూసిన అభిమానుల ఆశ్చర్యం రెట్టింపు అయ్యింది. తమన్నా భాటియా ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాటలో మాత్రమే నటించిందా.? లేక అతిథి పాత్రలో కనిపిస్తుందా.? అనేది ఇంకా క్లారిటీ లేదు. తమన్నా ఎంట్రీతో సినిమాపై హైప్ బాగానే పెరిగింది. ఇక ఈ సినిమాలో తమన్నా మరింత గ్లామరస్ గా కనిపించనుందని తెలుస్తోంది. లీకైన టీజర్ లో తమన్నా అందాలు ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..