Aamir Khan: ఆమెలో నాకు అదే నచ్చింది.. కొత్త గర్ల్ ఫ్రెండ్ గురించి ఆమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Mar 15, 2025 | 3:59 PM

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమీర్ ఖాన్ మళ్లీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ముంబైలో జరిగిన తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. గౌరీతో ఏడాది కాలంగా డేటింగ్‌ చేస్తున్నానని, ఆమె తనకు 25 ఏళ్లుగా తెలుసని ఆమీర్‌ తెలిపారు.

Aamir Khan: ఆమెలో నాకు అదే నచ్చింది.. కొత్త గర్ల్ ఫ్రెండ్ గురించి ఆమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Aamir Khan
Follow us on

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ఆయన ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకుని, తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసిన ఆమిర్ ఖాన్ జీవితంలోకి మళ్లీ కొత్త ప్రేమ ప్రవేశించిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమీర్ ఖాన్ ఓ యువతితో డేటింగ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆమె పేరు గౌరి. ఆమీర్ ఖాన్ రీసెంట్ గా తన 60వ పుట్టినరోజు సందర్భంగా కొత్త స్నేహితురాలిని పరిచయం చేశాడు. ఇప్పుడు గౌరి ఆమిర్ ఖాన్ లో తనకు నచ్చిన విషయాన్ని వెల్లడించింది. ఈకామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ముందుగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ.. గౌరీలో తనకు నచ్చిన విషయాన్ని వెల్లడించాడు. ‘నన్ను ప్రశాంతంగా ఉంచే, నాకు పీస్ ను ఇచ్చే భాగస్వామి కోసం నేను వెతుకుతున్నాను.’ గౌరికి ఆ లక్షణాలు ఉన్నాయి అనిఆమీర్ ఖాన్ అన్నారు. అలాగే గౌరీ మాట్లాడుతూ.. ‘నాకు మంచి వాడు, సౌమ్యుడైన, శ్రద్ధగల వ్యక్తి అవసరం.’ “అప్పుడు నేను ఆమీర్ ఖాన్ ను కలిశాను” అని గౌరి తెలిపింది.

ఆమీర్ ఖాన్ ,  గౌరీ 25 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. 25  సంవత్సరాలుగా తెలిసినప్పటికీ  ఇద్దరి మధ్య అంతగా మాటలు ఉండేవి కాదు. “మేము ఒకటిన్నర సంవత్సరం క్రితం మళ్ళీ పరిచయమయ్యాము” అని ఆమీర్ ఖాన్ అన్నారు.  గౌరి బెంగళూరులో పెరిగింది. అతను సౌత్ సినిమాల అభిమాని. ఆమె పెద్దగా హిందీ సినిమాలు చూడలేదు. గౌరీ ఏడాది క్రితం ఆమీర్ నటించిన ‘దిల్ చాహ్తా హై’, ‘లగాన్’ సినిమాలు చూసిందట. ఇక ఆమీర్ ఖాన్ మార్చి 14, 1965న జన్మించాడు. అదేవిధంగా, గౌరి ఆగస్టు 21, 1978న జన్మించింది. ఇద్దరి మధ్య దాదాపు 14 సంవత్సరాలగ్యాప్ ఉంది. ఈ విషయం గురించి బాలీవుడ్ లో చాలా చర్చ జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..