Preity Zinta: సినిమా ఇండస్ట్రీలో ఏళ్లతరబడి రాణించడం అందరి తరం కాదు. కొండంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. నిత్యం కొత్త అందాలు వస్తు ఉండే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నెట్టుకురావడం కష్టమే కానీ ఈ అమ్మడు ఆ కష్టాలను తట్టుకొని నిలబడింది. చదువుకునే రోజుల్లోనే ప్రీతీ జింటా అనుకోకుండా మోడలింగ్ దిశగా అడుగులు వేసింది . ఆమె తొలిచిత్రం ‘దిల్ సే’ . మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా చక్కని అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో దూసుకుపోయింది. తెలుగులోనూ నటించింది ప్రీతీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు డెబ్యూ మూవీ రాజకుమారుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ప్రీతీ. ఇలా కెరీర్ ప్రారంభంలోనే టాలీవుడ్లో మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువగా దృష్టి సారించిందీ ముద్దుగుమ్మ.
2016లో ఫిబ్రవరి 29న అమెరికాకు చెందిన జీనీ గుడ్ఇనఫ్ ను వివాహమాడింది. ఇటు సినిమాలు, అటు క్రీడల వ్యవహారాలతో బిజీగా గడుపుతోన్న ఈ సొట్టబుగ్గల సుందరి తాజాగా ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది. త్వరలోనే తల్లికాబోతుంది ఈ అందాల భామ. సోషల్ మీడియా వేదిక ఈ హ్యాపీ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది ప్రీతీ. నేను మీది అందరితో ఓ ఆనందకరమైన వార్తను పంచుకోవాలనుకుంటున్నాను.. జీనీ గుడ్ఇనఫ్ అలాగే నేను ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం.. మా మనసులు ఆనందంతో నిండిపోయాయి.. మేము మా కుటుంబంలోకి కవలలను జై జింటా గూడెనఫ్ మరియి గియా జింటా గూడెనఫ్ ఆహ్వానించబోతున్నాం..” అంటూ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ఈమేరకు ఆమె ట్విట్టర్ లో భర్తతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.
Hi everyone, I wanted to share our amazing news with all of you today. Gene & I are overjoyed & our hearts are filled with so much gratitude & with so much love as we welcome our twins Jai Zinta Goodenough & Gia Zinta Goodenough into our family. pic.twitter.com/wknLAJd1bL
— Preity G Zinta (@realpreityzinta) November 18, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :