ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్ వెకేషన్లో తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. ఈ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్టు షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం వచ్చే నెలలో ఈ మూవీ చిత్రీకరణ తిరిగి ప్రారంభంకానుందట. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే సూపర్ స్టార్ పాన్ ఇండియా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఇందులో భాగంగానే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉండనుందని.. అందులో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ నోరా ఫతేహి కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
చాలా కాలం తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు తెలుగుతోపాటు.. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాను హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
ఈ మూవీ తర్వాత మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ పట్టాలెక్కనుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండనుందని.. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉండనుందని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.