Disha Patani: గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? ‘కల్కి’ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. వీడియో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. కొన్నేళ్ల క్రితం వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన ఆమె పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోనూ కథానాయికగా చేసింది.

Disha Patani: గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? కల్కి హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. వీడియో
Bollywood Actress Disha Patani

Updated on: Sep 15, 2026 | 9:58 PM

బాలీవుడ్ నటి దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం హిందీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గ్లామరస్ నటీమణుల్లో దిశా ఒకరు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఆమె గ్లామరస్‌గా కనిపించడానికి ఏమాత్రం వెనుకాడదు. తన బికినీ ఫొటోల నుంచి ప్రైవేట్ ఈవెంట్‌ ఫొటోస్ వరకు అన్ని రకాల ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఇదే కారణంతోనే దిశా పటానీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సాధారణంగా దేవాలయాలకు లేదా మతపరమైన కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం ఆనవాయితీ. కానీ హీరోయిన్ దిశా పటాని మాత్రం ఇటీవల జరిగిన గణేష్ చతుర్థి పూజకు డీప్‌ నెక్‌ బ్రాలెట్‌ తరహా బ్లౌజ్‌ ధరించి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. దీంతో నెటిజన్లు దిశా పటానీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ముంబై నివాసం ఆంటిలియాలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా ఈ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎరుపు రంగు లెహంగా చోళీలో ముస్తాబైంది. లెహంగాతో పాటు డీప్‌ నెక్‌ బ్రాలెట్‌ తరహా బ్లౌజ్‌ ధరించంది. అయితే ఈ దుస్తుల డిజైన్‌ ఎక్కువగా రివీలింగ్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు దిశాను ట్రోల్‌ చేస్తున్నారు. భక్తి, పూజా కార్యక్రమాలకు ఇలాంటి దుస్తుల్లో రావడం సరైనది కాదంటూ దిశాకు హితవు పలుకుతున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ ఆకర్షణీయంగా కనిపించాల్సిన అవసరం లేదని కూడా కొందరు ఆమెకు సలహా ఇచ్చారు. కాగా దిశా పటానీతో పాటు బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, జెనీలియా, రితేష్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తదితర ప్రముఖులు అంబానీ ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇక నటి దిశా ఇటీవల విజయవంతమైన ‘అవారాపన్ 2’ చిత్రంలో కనిపించింది. దిశా హాలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేసింది. ఆమె మొదటి హాలీవుడ్ చిత్రం త్వరలో విడుదల కానుంది.

అంబానీ ఇంట గణేషుడి పూజలో దిశా పటానీ.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us