Bigg Boss: మూడు సినిమాల్లో హీరో ఛాన్స్.. ఆధార్ కార్డులో కులం చూసి తీసేశారు.. పాపం బిగ్‌బాస్ కంటెస్టెంట్

ఈ నటుడు సీరియల్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలు సూపర్ హిట్ సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించాడు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతోనూ బాగా పాపులర్ అయ్యాడు. అయితే హీరో అవ్వాల్సిన ఇతనిని ఆధార్ కార్డులో కులం చూసి తీసేశారట.

Bigg Boss: మూడు సినిమాల్లో హీరో ఛాన్స్.. ఆధార్ కార్డులో కులం చూసి తీసేశారు.. పాపం బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss Telugu Fame

Updated on: May 01, 2026 | 11:20 AM

సినిమా ఇండస్ట్రీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటుంది. కానీ ఈ వెలుగుల వెనక కనిపించని ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్, కుల వివక్ష తదితర కారణాలతో చాలా మంది ట్యాలెంట్ ఉన్నా గుర్తింపు తెచ్చకోలేకపోయారు. ఈ టాలీవుడ్ నటుడు కూడా సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతాడు. ఈ నటుడు గతంలో ‘మొగలిరేకులు’ వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించాడు. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేశాడు. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఇదే పాపులారిటీతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తన ట్యాలెంట్ కు తగ్గట్టుగానే చాలా సినిమాల్లో ఛాన్స్ లు కూడా వచ్చాయి. హీరోగా కూడా మూడు సినిమాల్లో అవకాశం వచ్చింది. అయితే తక్కువ కులం కారణంగా సినిమాలు ఆగిపోయాయట. హీరోగా కమిటైన మూడు సినిమాలు అగ్రిమెంట్‌ వరకు వచ్చి ఆ తర్వాత ఆధార్ కార్డులో తన కులం చూసి ఆగిపోయాయట. ఈ విషయాన్ని సదరు నటుడే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అతను మరెవరో కాదు విరూపాక్ష, దండోరా సినిమాల ఫేమ్ రవికృష్ణ.

ఆ మధ్యన రవికృష్ణ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో
తక్కువ కులానికి చెందిన యువకుడిగా రవి అద్బుతంగా నటించాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. ఆమె కులం వాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రేమికుడి పాత్రలో రవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలోనే మాట్లాడిన రవి కృష్ణ దండోరా సినిమాలో మాదిరే నిజ జీవితంలో తాను కూడా కుల వివక్షకు గురయ్యానని కన్నీటి పర్యంతం అయ్యాడు.

ఇవి కూడా చదవండి

రవి కృష్ణ లేటెస్ట్ ఫొటోస్..

‘కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్‌ చేసి చివరిలో నా కులం చూసి పక్కకు తప్పించారు. ఓ సినిమాకి అగ్రిమెంట్‌ భాగంగా నా ఆధార్‌ కార్డు పంపించాను. అ‍క్కడ నా కులం చూసి తప్పించారు. కారణం ఏంటని అడిగితే.. ఈ కథ మీకు సూట్ అవ్వదు.. ఇంకో ప్రాజెక్ట్‌కు చూద్దాం అని చెప్పారు. అలా మూడు సినిమాలు అగ్రిమెంట్‌ వరకు వచ్చి..కులం చూసి ఆగిపోయాయి’ అని రవి ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us