
బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక సింగ్ ఒకరు. అంతకు ముందు ‘జబర్దస్త్’ షోలో సాయి తేజగా లేడీ గెటప్స్ వేసిన ఆమె ఆ తర్వాత లింగ మార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారింది. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి తనకంటూ బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె అడపాదడపా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటుంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాజాగా తన పెళ్లి వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది ప్రియాంక సింగ్. అందులో పట్టుచీర, ఒంటినిండా నగలతో పెళ్లికూతురిలా ముస్తాబైందీ ప్రియాంక సింగ్. అలాగే వరుడు ఎవరో తెలియదు కానీ ఇద్దరూ కలిసి పూల దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది?
ప్రియాంక షేర్ చేసిన వీడియోను చూసి నెటిజన్లు షాక్ తిన్నారు.. ‘ అరే.. ప్రియాంక పెళ్లి చేసేసుకుందా?” అని కొందరు కామెంట్స్ పెడితే.. ‘వరుడు ఎవరో చెప్పకుండానే ప్రియాంక ఇలా షాక్ ఇచ్చిందేంటి?” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ పెళ్లి ఫొటోలు, వీడియోల వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే.. అది ఒక ప్రైవేట్ జ్యూయలరీ బ్రాండ్ కోసం చేసిన యాడ్ షూట్ మాత్రమే. దీంతో అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు ముక్కున వేలేసుకున్నారు.
కాగా ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ప్రియాంక సింగ్. ట్రాన్స్ జెండర్ కారణంగా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ నుంచి తీసేశారని ఆమె గతంలో పలు సార్లు వాపోయింది. ఇక లింగ మార్పిడి చేయించుకున్న విషయం తన తండ్రికి ఎలా చెప్పాలో తెలియక బిగ్ బాస్ హౌస్‌లోనే ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియాంక. తండ్రి మొదట షాక్ తిన్నా, ఆ తర్వాత ప్రియాంకను ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.