Bigg Boss Telugu 10: రోహిత్ రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.. జియో హాట్ స్టార్ సంచలన ప్రకటన

బిగ్ బాస్ 10లో రోహిత్ రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు కారణాలు చెబుతున్నారు. గత వారం ఎలిమినేషన్ లో రోహిత్ బిగ్ బాస్ జర్నీ ఏవీ వేయకపోవడం, అలాగే కొందరు చేస్తోన్న ట్వీట్స్ రోహిత్ రీఎంట్రీ గురించేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడీ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

Bigg Boss Telugu 10: రోహిత్ రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.. జియో హాట్ స్టార్ సంచలన ప్రకటన
Bigg Boss Telugu 10

Updated on: Nov 07, 2026 | 5:57 PM

గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో రోహిత్ పేరు తెగ మార్మోగుతుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటిన అతను కామనర్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆట, మాట తీరుతో అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటి ఓటింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చాడు. చివరకు సెలబ్రిటీలు కూడా పదే పదే రోహిత్ ను నామినేట్ చేశారంటే హౌస్ లో అతను ఎంత పవర్ ఫుల్ కంటెస్టెంటో అర్థమవుతోంది. అలాంటి రోహిత్ ను చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి ఎలిమినేట్ చేయడం, అది కూడా హౌస్ మేట్స్ తో బయటకు పంపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై రోహిత్ అభిమానులు భగ్గుమంటున్నారు. అతనిని ఎలాగైనా హౌస్ లోకి తీసుకురావాలని నెట్టింట ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కాగా దీపావళి రోజున రోహిత్ బిగ్ బాస్ రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందని అతని అభిమానులు నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఆశలపై జియో హాట్ స్టార్ నీళ్లు చల్లింది. రోహిత్ రీఎంట్రీ దాదాపుగా లేనట్టేనని ఇన్ డైరెక్టుగా చెప్పేసింది హాట్ స్టార్. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం (నవంబర్ 06) మధ్యాహ్నం 1 గంటకు రోహిత్ జియో హాట్ స్టార్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులు మీ రీ ఎంట్రీ ఉంటుందా అని రోహిత్ ని అడగ్గా, ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం నన్ను రీ ఎంట్రీ కోసం అడగలేదని , సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.

రోహిత్ సమాధానం పక్కన పెడితే.. బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అయ్యి జర్నీని పూర్తి చేసిన వాళ్లు మాత్రమే ఇలా లైవ్ ఛాట్ కు వస్తుంటారు. ఇప్పుడు రోహిత్ కూడా అదే చేయడంతో బిగ్ బాస్ 10లో అతని జర్నీ ముగిసినట్టేనని అర్థం చేసుకోవచ్చు. కాగా సెప్టెంబర్ 07న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రసవత్తరంగా, హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకంది. తొమ్మిదో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, టెంపర్ వంశీ, నీతు మాస్టర్, శివ, నరేష్, దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్ ఈ వారం ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంంటున్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా? లేదా ఇద్దరు బయటకు వెళ్లిపోతారా? అన్నది ఆదివారం (అక్టోబర్ 08) ఎపిసోడ్ తో తెలియనుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us