Bigg Boss Telugu 10: బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే.. బయటకొచ్చాక ఎవరూ పలకరించరు.. జబర్దస్త్ నటి కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. అయితే గతంలో ఈ షోలో కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసిన సెలబ్రిటీలు పలు సందర్భాల్లో ఈ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేశారు. హోస్ట్ నాగార్జున తీరును కూడా తప్పు పట్టారు.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే.. బయటకొచ్చాక ఎవరూ పలకరించరు.. జబర్దస్త్ నటి కామెంట్స్ వైరల్
Bigg Boss Telugu 10, Jabbardasth Actress

Updated on: Jul 19, 2026 | 11:14 AM

బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు బిబిగ్ బాస్ మళ్లీవస్తున్నాడు. ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం ఈసారి మరిన్ని హంగులుతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ పదో సీజన్ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ ల్యాండ్ మార్క్ సీజన్ కు సంబంధించి వరుసగా ప్రోమోలు రిలీజవుతున్నాయి. అలాగే కామన్ కంటెస్టెంట్స్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష 2 ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి.మరోవైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసిన కొందరు సెలబ్రిటీలు ఈ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేశారు. గీతూ రాయల్, సోనియా ఆకుల వంటి సెలబ్రిటీలైతే డైరెక్టుగా బిగ్ బాస్ పై నెగెటివ్ కామెంట్స్ చేశారు. అలాగే హోస్ట్ నాగార్జునపై కూడా విమర్శలు చేశారు. ఇదే క్రమంలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన జబర్దస్త్ ఫైమా ఈ రియాలిటీ షోపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

బిగ్‌బాస్‌ షోలోకి వెళ్లడానికి కూడా జబర్దస్త్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. నేను సీజన్ 6కి వెళ్లినందుకు ఫీల్ కాలేదు కానీ, సీజన్ 7లో కంటెస్టెంట్‌గా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే సీజన్ 6లో నాకు గట్టిపోటీ అనిపించలేదు. నిజం చెప్పాలంటే బిగ్‌బాస్ వల్ల నా జీవితానికి చాలా మంచి జరిగింది. ఎక్కడా నెగిటివ్‌గా ఆడలేదు, పాజిటివ్‌గానే ఆడాను. బయటకొచ్చిన తర్వాత కూడా అందరూ బిగ్‌బాస్ ఫైమా అనే అని పిలిచేవారు. నాకు నా ఇల్లే ప్రపంచం. జబర్తస్త్ ఫ్రెండ్స్ బయట కలుద్దామని పిలిచినా నేను ఎక్కడికి వెళ్లేదానిని కాదు. ఏ పనిలేకపోతే ఇంట్లోనే ఉండేదాన్ని. ఇక బిగ్‌బాస్ సీజన్ 6 ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలుద్దామని కొన్నిరోజులు హడావుడి చేశారు. గ్రూప్ మొత్తం మెసేజ్‌లతో హల్‌చల్ చేశారు. కానీ రోజులు గడిచేకొద్ది మళ్లీ మామూలే. ఎవరూ పట్టించుకునేవారు కాదు. మూడు రోజుల మురిపెం అంటారు కదా అలానే జరిగింది’

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ టీమ్ తో ఫైమా..

‘మొదట్లో ఏమో కలుద్దాం రండి.. కలుద్దాం రండి అంటూ తెగ ఫోన్‌లు, మెసేజులు చేసేవారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. నా ఇంటి గృహ ప్రవేశానికి కూడా ఎవరినీ వదిలిపెట్టకుండా అందరినీ పిలిచాను. కానీ సూర్య ఒక్కడే వచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. నేను కూడా సినిమా ఇండస్ట్రీ కాబట్టి వారి పరిస్థితిని అర్ధం చేసుకున్నా. అందరికీ షూటింగ్స్ ఉంటాయి.  కానీ తర్వాత వస్తామని చెప్పినవాళ్లు ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదు’ అని ఫైమా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భర్తతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us