Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే

ఎండాకాలంలో కల్లు తాగితే చలవ అని కల్లు ప్రియులు చెబుతూ ఉంటారు. ఎటువంటి రసాయనాలు కలపకపోతే కల్లు ఒంటికి చాలా మంచిదని పెద్దలు కూడా అంటారు.

Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే
Telugu Actress

Updated on: Mar 16, 2022 | 6:39 PM

Telugu Actress: ఎండాకాలంలో కల్లు తాగితే చలవ అని కల్లు ప్రియులు చెబుతూ ఉంటారు. ఎటువంటి రసాయనాలు కలపకపోతే కల్లు ఒంటికి చాలా మంచిదని పెద్దలు కూడా అంటారు. అందుకేనేమో ఈ మధ్య కల్లు తాగేవారి సంఖ్య పెరిగిపోతుంది. మొన్నామధ్య అఖండ(Akhanda) సినిమాలో హీరో బాలయ్య, హీరోయిన్ తో కలిసి కల్లు తాగే సీన్ బాగా ఫేమస్ అయ్యింది. తాజాగా ఓ తెలుగు బిగ్ బాస్(Bigg Boss) బ్యూటీ కూడా కల్లు టేస్ట్ చేసింది. ఆమె ఎవరో కాదండోయ్.. మన తెలుగు నటి హిమజ. బిగ్‌బాస్‌ షో ద్వారా కూడా ఈమె బాగా ఫేమస్ అయ్యింది. మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సీరియల్స్‌లో కీలక పాత్రలు చేసి.. మహిళలకు చేరువైంది. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది. సినిమాల్లో ఫ్రెండ్ పాత్రలతో పాటు.. వదిన, అక్క పాత్రల్లో మెప్పించింది. బిగ్‌బాస్‌ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది. కాగా సోషల్ మీడియాలో హిమజ చాలా యాక్టివ్. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటుంది. తాజాగా తాటిరేకులో కల్లు తాగుతూ హిమజ  హల్చల్ చేసింది. చివర్లో కల్లు అద్భుతంగా ఉందంటూ ఎక్స్​ప్రెషన్​ కూడా ఇచ్చింది. ప్రజంట్ తెగ ట్రెండ్ అవుతున్న అరబిక్‌ కుతు సాంగ్‌ను ఈ వీడియోకు యాడ్ చేసి తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Andhra Pradesh: ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన.. వారికి ఆర్టీసీ బస్సుల్లో రాయితీ