Bigg Boss 5 Telugu: రవి- షణ్ముఖ్ మధ్య మంటలు.. కెప్టెన్ అయ్యి చూపిస్తానంటున్న శ్రీరామ్..

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. కెప్టెన్సీ టాస్క్ నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు ఆసక్తిగా ఉంటాయి.

Bigg Boss 5 Telugu: రవి- షణ్ముఖ్ మధ్య మంటలు.. కెప్టెన్ అయ్యి చూపిస్తానంటున్న శ్రీరామ్..
Bigg Boss

Updated on: Oct 07, 2021 | 6:41 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. కెప్టెన్సీ టాస్క్ నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు ఆసక్తిగా ఉంటాయి. అలాగే నామినేషన్ టైంలో కూడా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ నానా రచ్చచేస్తారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్  కూడా అలాగే నడిచిందని తెలుస్తుంది. ప్రస్తుతం హౌస్‌లో శ్రీరామ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో హౌస్ మేట్స్‌కు ఎవరు రాజు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే హౌస్‌లోకి వచ్చిన వారిలో శ్రీరామ్ హమీద ప్రేమ ఉండటం మనం చూస్తున్నాం.. ఇద్దరు ఎప్పుడూ కలిసే కనిపిస్తున్నారు. నేటి ఎపిసోడ్‌లో ఈ విషయం పై హౌస్ మేట్స్ మధ్య చర్చ జరిగిందని తెలుస్తుంది. హమీద శ్రీరామ్ ఎప్పుడూ ఒకరినొకరు సేవ్ చేసుకుంటున్నారంటూ హౌస్‌లో ఉన్నవారు డిస్కషన్ పెట్టారు.

శ్వేతా వర్మ- ఆనీ మాస్టర్ మాట్లాడుకుంటూ.. రామ్- హమీద అంటాడు.. హమీద రామ్ అంటుంది అని ఆనీ మాస్టర్ అన్నారు. అలాగే షణ్ముఖ్ హమీద కెప్టెన్ అవ్వకూడదు అంటూ తన అభిప్రాయాన్ని చెప్తాడు.. హమీద కంటెంటర్ అయితే నేను ఆడాను అంటూ ప్రియా కూడా చెప్పేసింది. అలాగే షణ్ముఖ్ మాట్లాడుతూ.. రవి నాకు ఫస్ట్ డే చెప్పాడు నిన్ను కంటెంటర్‌గా చేస్తా ఇటు వచ్చేయ్ అన్నాడు. సిరి ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది అంటూ హింట్ ఇచ్చింది. ఇక శ్రీరామ్ నేను కెప్టెన్ అయ్యి చూపిస్తా ఏం చెయ్యాలో… అని అంటాడు.. దానికి అరే బాప్రే అంటూ ఆశ్చర్యపోతాడు విశ్వ. శ్రీరామ్‌కు సన్నీకి మధ్య వివాదం రేగిందాని చూపించారు. అలాగే షన్నుకు రవికి మధ్య కూడా దూరం పెరిగిందని చూపించారు.. ఈ నేపథ్యంలో నేటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Niharika Konidela : ఆంధ్రా కాశ్మీరం అద్భుతం.. ఇన్నాళ్ళూ మిస్సయ్యానంటున్న మెగా డాటర్ నిహారిక

Vaisshnav Tej-Rakul Preet Singht-Konda Polam: నల్లమల్ల అడవుల్లో అందమైన ప్రేమ ప్రయాణం.. కొండపాలం పోస్టర్స్ పై మీరు ఓ లుక్కేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us