Bigg Boss 5 Telugu: అతను జెమ్ ఆఫ్ పర్సన్.. ఇతను తోప్.. ఆ ఇద్దరి గురించి రవి ఆసక్తికర వ్యాఖ్యలు..

బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ఎవరు ఉంటారో ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారో చెప్పడం చాలా కష్టంగా మారింది.

Bigg Boss 5 Telugu: అతను జెమ్ ఆఫ్ పర్సన్.. ఇతను తోప్.. ఆ ఇద్దరి గురించి రవి ఆసక్తికర వ్యాఖ్యలు..
Ravi

Updated on: Nov 29, 2021 | 9:16 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ఎవరు ఉంటారో ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఇక బిగ్ బాస్ చివరి దశకు వస్తున్న కొద్దీ ఆసక్తి పెడుతుంది. టాప్ 5లో ఎవరుంటారు.. బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. నిన్న జరిగిన ఎలిమినేషన్ లో ఊహించని విధంగా యాంకర్ రవి అవుట్ అయ్యి బయటకు వచ్చాడు. రవిని ఎలిమినేట్ అంటూ ప్రకటించడం తో అందరు షాక్ అయ్యారు. రవి ఎలిమినేట్ అవ్వడంతో సన్నీ, షన్ను, సిరి, ప్రియాంక వెక్కి వెక్కి ఏడ్చారు. కానీ రవి మాత్రం అస్సలు ఎమోషనల్ అవ్వలేదు. ఇక బయటకు వచ్చిన రవి హౌస్ లో ఉన్నవారికి సలహాలు ఇచ్చాడు.

నువ్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి? అని షాక్ అయ్యాడు శ్రీరామ్ చంద్ర. నేను తప్పుగా క్యాలిక్యులేట్ చేశానేమో అని రవి అన్నాడు. ఇక బయటకు వచ్చిన రవి.. షన్ను మెచ్యూరిటీకి మారు పేరు.. షన్నుతో కలిసి బిగ్ బాస్ జర్నీ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను అనిచెప్పుకొచ్చాడు రవి. ఆతర్వాత శ్రీరామచంద్ర నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటాను.. ఇంచు కూడా స్వార్థమన్నది ఉండదు.. జెమ్ ఆఫ్ పర్సన్.. అన్నీ పర్ఫెక్ట్. నువ్ లోపల ఆడు. నీ కోసం నేను బయట ఆడుతాను అని అన్నాడు రవి. సన్నీ తోపు సర్.. ఫ్రెండ్ అంటే చాలు ఏదైనా ఇస్తాడు.. ఎంత దూరమైన వెళ్తాడు.. అది చాలా మంచిది.. దాని వల్లే ఇక్కడి వరకు వచ్చాడు.. అది బయట కూడా పనికొస్తుంది అని రవి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రియాంక, కాజల్, మానస్, సిరిలను ఫెయిల్ అని చెప్పాడు రవి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha: చిరిగిన షర్ట్‌కు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా.? వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ ఫోటో..

Rashmika: అందాల రష్మిక మోటివేషనల్‌ పోస్ట్‌.. భయాన్ని ఎలా జయించాలో ఎంత బాగా చెప్పిందే చూడండి..

Shivani Rajashekar: చీరకట్టులో ‘అద్భుతం’గా అందాల తార.. శివాని రాజశేఖర్‌ లేటెస్ట్‌ ఫోటోలు చూశారా.?

 

 

Follow Us