Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు

Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Sai Srinivas

Updated on: Jan 03, 2022 | 9:05 PM

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ తర్వాత బెల్లంకొండ నటించిన చిత్రాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బాలీవుడ్‏లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేష‌న్‌లో ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ తాజాగా టాకీ పార్ట్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది.

ఈ చిత్రాన్ని నిర్మాత ధవల్ జ‌యంతిలాల్ గ‌డ‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఫిజికల్‌గా సరికొత్తగా కనిపించనున్నారు. ఛ‌త్ర‌ప‌తి చిత్రానికి క‌థ‌ను అందించిన స్టార్ రైట‌ర్‌, రాజ‌మౌళిగారి తండ్రి కె.వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ రీమేక్‌కు క‌థ‌ను అందించారు. ఈ సినిమాను ఓ మాస్టర్‌పీస్‌గా చేసేందుకు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్‌ చేస్తున్నారు. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు వంటి తెలుగు హిట్‌ సినిమాలతో పాటుగా, తమిళ సినిమాలకు కూడా పని చేసిన సినిమాటోగ్రాఫర్‌ నిజర్‌ అలీ షఫీ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. తనిష్క్‌ బాచి ఈ చిత్రానికి స్వరకర్త. అన‌ల్‌ అర‌సు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మహర్షి, గజిని, స్పెషల్‌ 26 వంటి చిత్రాలకు పని చేసిన ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ సునీల్‌బాబు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. మయూర్‌ పూరి ఈ చిత్రానికి డైలాగ్స్‌ అందిస్తున్నారు.

Also Read: Kajal Aggarwal: తొలిసారి బేబి బంప్‏తో కనిపించిన కాజల్.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

Loading...
Unable to load recommendations.
Follow Us