Khaidi Movie: ఖైదీ మూవీ ఆ స్టార్ హీరో చేయాల్సింది.. చిరంజీవి దగ్గరకు ఎలా వచ్చిందంటే..!

చిరంజీవి కెరీర్‌లో ‘ఖైదీ’కి ముందు, ‘ఖైదీ’కి తర్వాత అనేంత గొప్ప చిత్రం ఇది. మొదట సూపర్‌స్టార్ కృష్ణ కోసం అనుకున్న ఈ కథ చిరంజీవి వద్దకు చేరింది. ఫస్ట్‌ బ్లడ్ స్ఫూర్తితో, పలు అవాంతరాలను అధిగమించి, అద్భుతమైన వసూళ్లతో అప్పట్లో అమలైన స్లాబ్‌ విధానాన్ని కూడా తట్టుకొని, తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

Khaidi Movie: ఖైదీ మూవీ ఆ స్టార్ హీరో చేయాల్సింది.. చిరంజీవి దగ్గరకు ఎలా వచ్చిందంటే..!
Chiranjeevi Khaidi Movie

Updated on: Apr 25, 2026 | 5:10 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే అందించకుండా, ఒక తరాన్ని, ఒక పరిశ్రమను ప్రభావితం చేస్తాయి. అలాంటి చిత్రాలలో 1983లో విడుదలైన ‘ఖైదీ’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఈ చిత్రం ఒక టార్చ్ బేరర్‌గా మారడమే కాకుండా.. ఆయన్ని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది. ఈ చిత్రం చిరంజీవితో పాటు దర్శకుడు కోదండరామిరెడ్డిని, రచయితలు పరుచూరి బ్రదర్స్‌ను టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి చేర్చింది. ‘ఖైదీ’ కథా నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

నిజానికి ఈ కథ మొదట సూపర్‌స్టార్ కృష్ణ కోసం రాసిందట, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చిరంజీవి వద్దకు చేరింది. హాలీవుడ్ చిత్రం ‘ఫస్ట్‌ బ్లడ్’ స్ఫూర్తితో, అడవి నేపథ్యంలో సాగే యాక్షన్ సీన్లు, చిరంజీవి బ్లాక్ అండ్ బ్లాక్ గెటప్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాయి.  సినిమాలో చిరంజీవి పోషించిన సూర్యం పాత్ర చాలా సేపటి వరకు డైలాగ్స్ లేకుండా, కేవలం తన కళ్లు, హావభావాలతోనే పగను పండించడం ఆయన నటనకు నిదర్శనం. రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ లాంటి ఉద్దండుల నటన ఈ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది.

1983 అక్టోబరు 28న విడుదలైన ఈ చిత్రం, అప్పటి రాజకీయ వాతావరణంలోనూ సంచలనం సృష్టించింది. అప్పట్లో ఎన్టీ రామారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్లాబ్ సిస్టమ్’ పన్ను విధానాన్ని తట్టుకొని, ఖైదీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా సాధించిన వసూళ్లు తెలుగు సినిమా మార్కెట్ పరిధిని అమాంతం పెంచేశాయి. ఈ విజయంతో చిరంజీవి రెమ్యూనరేషన్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అయిన ఈ చిత్రం, తెలుగు కమర్షియల్ సినిమాలకు ఒక కొత్త దిశానిర్దేశం చేసి, చిరంజీవిని ‘మెగాస్టార్’ అనే సింహాసనంపై కూర్చోబెట్టింది.

ఇది చదవండి: శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.! ఆయన గురించి చిరంజీవి ఏమన్నారంటే.. డిస్కో శాంతి

Loading...
Unable to load recommendations.
Follow Us