Balakrishna – Anil Ravipudi: రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆలోచనలో పడ్డ రావిపూడి.. తదుపరి ఏం అనగా..

|

Jul 18, 2022 | 8:50 AM

బాలయ్య రీసెంట్ డేస్లో ఫుల్ ఫాంలో ఉన్నారు. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. యంగ్ హీరోలను మించి మంచి లైనప్‌ తో ఫ్యూచర్..

Balakrishna - Anil Ravipudi: రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆలోచనలో పడ్డ రావిపూడి.. తదుపరి ఏం అనగా..
Balayya Anil Ravipudi
Follow us on

బాలయ్య రీసెంట్ డేస్లో ఫుల్ ఫాంలో ఉన్నారు. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. యంగ్ హీరోలను మించి మంచి లైనప్‌ తో ఫ్యూచర్ సినిమాలను డిక్లేర్ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని సినిమా NBK107తో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో.. అప్పుడే అనిల్ రావిపూడి డైరెక్లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు.ఇక వరుస హిట్లతో జోరు మీదున్న అనిల్ రావిపూడి… రీసెంట్ గా చెప్పిన ఓ స్క్రిప్ట్ కు ఓకే చెప్పారు బాలయ్య. ఓకే చెప్పడమే కాదు.. గోపీచంద్ సినిమా కంప్లీట్ అవగానే.. ఆలస్యమనేదే లేకుండా.. ఈ సినిమా సెట్ లో అడుగుపెడతానని అన్నారట కూడా..! అయితే బాలయ్య మాటలకు తగ్గట్టే.. పూర్తి బౌండెడ్‌ స్క్రీప్ట్ ను రెడీ చేస్తున్నారు రావిపూడి.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు కావాల్సిన ఏర్పాట్లును కూడా దగ్గరుండి చూసుకుంటున్నారట.

ఇక ఈ క్రమంలోనే.. బాలయ్య, అనిల్ రావిపూడి NBK108 సినిమా పేరు ‘బ్రో ఐడోంట్‌ కేర్‌’ నెట్టింట లీక్‌ అయిపోయింది. నందమూరి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు తెగ నచ్చేసింది. కాని అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్‌.. ఈ సినిమా పేరుబాలయ్యకు నచ్చలేదట. తండ్రి కూతుళ్ల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆ పేరు కరెక్ట్ కాదని బాలయ్య ఫీలువతున్నారట. ఇదే విషయాన్ని తాజాగా అనిల్ రావిపూడికి చెప్పారట. దీంతో అనిల్ రావిపూడి మరో పేరు పెట్టేందుకు ఆలోచిస్తున్నారట. ఇప్పుడిదే విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.