AVS: కమెడియన్స్‌లో ఆయనంటే నాకు చాలా ఇష్టం.. యాక్టింగ్ భేలే ఉంటుంది

ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు, రచయిత ఏవీఎస్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తుత్తి డైలాగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఏవీఎస్, కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించారు. తన కెరీర్‌ను ఒక యాక్షన్ ఫిలిం, ఫైటింగ్ స్టోరీగా అభివర్ణించిన ఆయన, హీరో విజయం వెనుక కమెడియన్ల పాత్ర ఎంతో ఉందని నొక్కి చెప్పారు.

AVS: కమెడియన్స్‌లో ఆయనంటే నాకు చాలా ఇష్టం.. యాక్టింగ్ భేలే ఉంటుంది
Avs

Updated on: Nov 06, 2026 | 6:20 AM

ప్రముఖ దివంగత హాస్యనటుడు, దర్శకుడు, రచయిత ఏవీఎస్ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తుత్తి అనే రెండు అక్షరాల పదం తనను ఓవర్‌నైట్ స్టార్ కామెడియన్‌గా మార్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా తన ప్రయాణాన్ని కొనసాగించిన ఏవీఎస్, ఒకానొక దశలో మృత్యువుతో పోరాడి గెలిచానని, అందుకే తాను మృత్యుంజయుడు ఏవీ సుబ్రహ్మణ్యం అని తనదైన శైలిలో చమత్కరించారు. తన సినీ ప్రయాణాన్ని సక్సెస్ స్టోరీనా, ఫెయిల్యూర్‌ స్టోరీనా అని అడగగా, “ఇట్స్ ఏ యాక్షన్ ఫిలిం, ఇట్స్ ఏ ఫైటింగ్ స్టోరీ. నా దృష్టిలో నేనే హీరో” అని ఏవీఎస్ బదులిచ్చారు. కామెడీ సినిమా విజయానికి ఎంత కీలకమో వివరిస్తూ, “సినిమా ఎలా ఉందిరా అంటే కామెడీ చాలా బాగుందిరా అంటారు” అని చెప్పారు. విజయంలో అధిక శాతం కామెడీదే కాబట్టి, కమెడియన్‌గా తాను ఎప్పుడూ తనను తాను హీరోగానే భావిస్తానని తెలిపారు.

దర్శకత్వం వైపు మనసు మళ్లిన వైనాన్ని వివరిస్తూ, తాను బేసిక్‌గా జర్నలిస్టుగా పని చేస్తున్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటని, ఒక ఫ్లోలో కథ చెబుతుండగా, బాపు-రమణ గార్ల ప్రోత్సాహంతో దర్శకుడిగా మారావని చెప్పారు. పెద్ద హీరోలు, ప్రేమ కథలు కావాలని నిర్మాతలు కోరుకునే నేపథ్యంలో, అంకుల్ అనే ఒక క్యారెక్టర్ కథను సినిమాగా నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే నిర్మాతగా మారానని వివరించారు. ఆ సమయంలో కొంత సెగ తగిలింది, ఆ తర్వాత చేతులు కాలినయ్ అని తన ఆర్థిక కష్టాలను నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఆర్థికంగా తన చిత్రాలు విజయం సాధించకపోయినప్పటికీ, తాను తీసిన సినిమాలు ఎవరూ బాగాలేదు అని అనలేదని ఏవీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శకుడిగా మళ్లీ అవకాశం వస్తే చేస్తానని, కానీ నిర్మాతగా మాత్రం చేయనని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న సమయంలో కథలు రాసుకుంటూ, డైలాగ్స్ తయారు చేసుకుంటూ బిజీగా ఉంటానని, పనిలో ఉండటం వల్లనే తాను ఎక్కువ రిలాక్స్ అవుతానని పేర్కొన్నారు.

రాపిడ్ ఫైర్ సెషన్‌లో తనకిష్టమైన దర్శకుడిగా బాపును, సహనటుడిగా కోట శ్రీనివాసరావును, లేడీ కమెడియన్‌గా రమాప్రభను ఎంపిక చేసుకున్నారు. నటుడిగా తన బెస్ట్ ఫిలిం అంకుల్ అని, మిస్టర్ పెళ్ళాం సినిమాలో తుత్తి డైలాగ్ గుర్తింపు తెచ్చినా, అంకుల్‌లో నటించడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో 127 మంది కమెడియన్లు ఉన్నారని, కామెడీ పాత్రల సృష్టి పెరిగిందని, కమెడియన్లు బిజీగా ఉన్నారని ఏవీఎస్ అన్నారు. తోటి కమెడియన్ల మధ్య చిన్న చిన్న ఈగోలు, జెలసీలు ఉండొచ్చని, కానీ అవి క్షణికమే తప్ప శాశ్వతం కావని ఏవీఎస్ కుండబద్దలు కొట్టారు. “మేమందరం కలుసుకుంటే మా అంత జోవియల్ గా ఎవరు ఉండరు” అని చెప్పారు. సినీ పరిశ్రమ తనను బాధపెట్టిన విషయాలు ఏమీ లేవని, అయితే తాను మంచి సినిమాలు తీశాను కానీ హిట్ సినిమాలు తీయలేదనే ముద్ర మాత్రం అర్థం కాని ప్రశ్నగా మిగిలిందని ఏవీఎస్ పేర్కొన్నారు. తన జీవితంలో ఎదురైన తీవ్ర అనారోగ్యం, కుమార్తె కిడ్నీ దానం చేసి ప్రాణం పోయడం వంటి సంఘటనల గురించి వివరించారు. ఆపరేషన్‌కు ముందే ఆ పరిస్థితి నుంచి తేరుకున్నానని, కుమార్తె తన పునర్జన్మ ఇచ్చిన అమ్మ అని భావోద్వేగంగా చెప్పారు. ఆ ఘటన తర్వాత జీవితం విలువ మరింత బాగా తెలిసిందని, అందుకే ఇప్పుడు మరింత బిజీగా పని చేస్తున్నానని తెలిపారు. బాపు-రమణ గార్ల వ్యక్తిత్వాల నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us