అబ్బా సాయి రామ్..!! మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్.. థియేటర్స్‌లో రూ. 225 కోట్లు రాబట్టిన సినిమా

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు స్ట్రీమింగ్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి .

అబ్బా సాయి రామ్..!! మూడు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్.. థియేటర్స్‌లో రూ. 225 కోట్లు రాబట్టిన సినిమా
Ott Movie

Updated on: Mar 27, 2026 | 8:34 AM

కొన్ని సినిమాలు థియేటర్స్ లోనే చూడాలి. ముఖ్యంగా విజువల్ వండర్ మూవీస్ ను థియేటర్స్ లో చూస్తేనే మజా.. ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ సినిమాలు చేస్తూ డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఓటీటీల పుణ్యమా అని ఫ్యామిలీస్ మొత్తం ఇంట్లోనే కూర్చొని సినిమాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మాములుగా అయితే సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తాయి. ఎంత డిజాస్టర్ అయిన సినిమా అయినా సరే రెండు మూడు వారల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. అయితే సంచలన విజయం సాధించిన ఓ సినిమా మాత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఏకంగా మూడు నెలలు టైం తీసుకుంది. ఎప్పటినుంచో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు.. దేశంతో కూడా పనిలేదు. అందులో జేమ్స్ కామెరూన్ ఒకరు. పేరుకు హాలీవుడ్ అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యాడు జేమ్స్ కామెరూన్. ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫ్రాంచైజ్‌గా నిలిచిన ‘అవతార్’ సిరీస్ మూడో భాగం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ ఈ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

అయితే గత రెండు పార్ట్స్ తో పోల్చుకుంటే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అని భాషల్లో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. దాదాపు మూడు నెలల తర్వాత అవతార్ ఫైర్ అండ్ యాష్ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో రెంటల్ రూపంలో అందుబాటులోకి రానుంది. కాగా అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా.. ఇక మనదగ్గర ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదలకానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఏప్రిల్ లేదా మే నెలలో రీజనల్  ల్యాంగ్వేజ్స్ లో విదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అవతార్ 3 సినిమా మనదగ్గర  థియేటర్లలో రూ.225 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టింది.

ఇవి కూడా చదవండి

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us