Jersy Movie: తెలుగు చలన చిత్ర చరిత్రలో జెర్సీ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా నచ్చని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా చూసే ప్రతీ వ్యక్తి అర్జున్ పాత్రలో తనను తాను చూసుకుంటాడు. ఎమోషనల్ జర్నీగా సాగిన ఈ సినిమా తెలుగు తెరపై ఓ అద్భుతాన్ని సృష్టించింది. తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమాను ఇప్పుడు హిందీలోనూ రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే జెర్సీ స్టామీనా కేవలం భారత దేశానికే పరిమితం కాలేదు. అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ఎమోషన్‌కు భాషతో, ప్రాంతంతో సంబంధం లేదని నిరూపించిందీ సినిమా. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అమండా బైలీ ఇటీవల జెర్సీ సినిమాను చూశారు. తనకు తెలియని భాషకు సంబంధించిన జెర్సీ చిత్రం.. అమండా హృదయానికి ఎంతగానో హత్తుకుంది. ఈ విషయాన్ని వెంటనే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు అమండా. జెర్సీ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. `నేను జెర్సీ సినిమాను చూశాను. ఈ సినిమా ఒక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ. అర్జున్ తన కలను సాకారం చేసుకునే విధానాన్ని మేకర్స్ బ్రిలియంట్‌గా చూపించారు. హీరో నాని అద్భుతంగా నటించారు. మీరు అతనితో నవ్వుతారు, అతనితో ఏడుస్తారు. ఈ సినిమాలో నా ఫేవరేట్ సీన్.. ట్రైన్ సన్నివేశం` అంటూ జెర్సీ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అమండా.
I watched Jersey! What an emotional journey. The creators did a brilliant job of drawing you in – you back Arjun’s dreams as much as him.
Nani did a beautiful job. You smile with him, you cry with him. My favourite scene is at the train station – my fear turned to elation. ?— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) June 26, 2021
North Indian actresses: ఉత్తరాధి భామలు టాలీవుడ్‌పై దండెత్తారు.. ఎంతమంది క్యూ కట్టారో మీరే చూడండి