Shalini Pandey- Ritika Singh: కారులో షికారుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్న క్యూట్ హీరోయిన్స్.. మాములు రచ్చకాదుగా..

శాలినీ పాండే.. ఈ పేరు మీకు గుర్తుందా.. గుర్తుకు లేదు కదా...! అదే... అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ అంటే మాత్రం ఇమ్మీడియట్‌గా మీ మైండ్‌లోకి..

Shalini Pandey- Ritika Singh: కారులో షికారుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్న క్యూట్ హీరోయిన్స్.. మాములు రచ్చకాదుగా..
Shalini Pandey Ritika Sing

Updated on: Aug 04, 2021 | 9:32 PM

Shalini Pandey- Ritika Singh: శాలినీ పాండే.. ఈ పేరు మీకు గుర్తుందా.. గుర్తుకు లేదు కదా…! అదే… అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ అంటే మాత్రం ఇమ్మీడియట్‌గా మీ మైండ్‌లోకి ఈ అమ్మాయి రూపం వచ్చేస్తోంది!  అర్జున్‌ రెడ్డి సినిమాలో… తన ఇన్నోసెంట్‌ అండ్‌ క్యూట్‌ లుక్స్‌తో తెలుగు కుర్రాలందర్నీ మెస్మరైజ్‌ చేసిన శాలినీ పాండే… ఆ తర్వాత నిశ్శబ్దం సినిమాలో ఓ పాత్రలో కనిపించి మెప్పించింది. అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ చిన్నది హీరోయిన్ గా తెలుగులో నటించలేదు. ఇక చాలా రోజుల తరువాత ఇప్పుడు మన అందరి ముందుకు వచ్చారు. మరింత అందంగా… మరింత నాజూగ్గా.. మరింత అల్లరి చేస్తూ…నెట్టింట వైరల్‌ అవుతున్నారు.

ఇక ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే మరో హీరోయిన్‌ రితికా సింగ్‌.. ఈ అర్జున్‌ రెడ్డి బ్యూటీని మన ముందుకు తీసుకువచ్చారు. వెంకటేష్ నటించిన గురు సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది రితికా సింగ్‌ ఆతర్వాత తెలుగులో సినిమాలుం చేయకపోయినా మలయాళంలో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. దాదాపు ఇండస్ట్రీకి ఓకే సారి వచ్చిన వీరిద్దరు మంచి ఫ్రెండ్స్‌. అయితే తాజాగా వీరిద్దరు కలిసి సరదాగా కారులో డ్రైవ్‌కెళ్లారు. ఇక ఆ ట్రిప్‌లో వారు చేసిన అల్లరిని వీడియో తీసిన రితికా.. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో… షాలినీ పాండే మరో సారి అందరి ముందుకు వచ్చినట్లైంది.!

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gehana Vasisth: ‘గందీ బాత్‌’.. నగ్నంగా లైవ్‌‌‌లోకి వచ్చిన హీరోయిన్.. షాక్ అయిన నెటిజన్లు..

MAA Elections 2021: తెగేదాకా లాగొద్దన్న మోనార్క్‌.. టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా ప్రకాష్ రాజ్ ట్వీట్

Shah Rukh Khan: త్వరలో పట్టాలెక్కనున్న షారుక్ ఖాన్- అట్లీ సినిమా.. ముందుగా అదిరిపోయే టీజర్‌‌‌‌‌ సిద్ధం..