
సంధ్యా రాజు (Sandhya Raju) కూచిపూడి నృత్యకారిణి. నాట్యం (Natyam) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటన పరంగా ప్రశంసలు అందుకుంది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సంధ్యారాజు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇటీవల సంధ్యారాజు చేసిన ఓ ప్రత్యేకమైన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ఆ వీడియో చూసి సంధ్యా రాజును ప్రశంసించడం విశేషం..
అసలు విషయానికి వస్తే.. ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ రచయిత.. ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం ఫినామినల్ ఉమెన్‌కు మెడ్రన్ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ వీడియోను రూపొందించింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోను మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఈ వీడియోను ఎఆర్ రెహమాన్ ప్రశంసించారు. సంధ్యారాజు.. మోడ్రన్ కూచిపూడి.. పర్ఫామెన్స్ అద్భుతం.. మాయ దేవకన్య అంటూ పొగడ్తలు కురిపించారు.
ట్వీట్..
Also Read: Jayamma Panchayathi: సుమ కనకాల పంచాయతీ పెట్టేది ఆ రోజునేనంట.. రిలీజ్ డేట్ ఫిక్స్
Kiran Abbavaram: జోరు పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా మొదలు పెట్టేసిన కిరణ్ అబ్బవరం..
RRR Movie: అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీఎమ్.. ఎత్తర జెండా ఫుల్ సాంగ్ వచ్చేసింది..
Aamir Khan: మాజీ భార్యలతో బంధంపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు