Anushka Shetty: అందాల అనుష్కకు అదిరిపోయే ఆఫర్.. ఆ అగ్రనటుడితో నటించే ఛాన్స్..

సూపర్ సినిమాతో ఎంట్రీఇచ్చిన బ్యూటీ అనుష్క. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకొని దూసుకుపోయింది ఈ బ్యూటీ. తక్కువ సమయంలోనే తెలుగులో బిజీగా హీరోయిన్ గా మారింది.

Anushka Shetty: అందాల అనుష్కకు అదిరిపోయే ఆఫర్.. ఆ అగ్రనటుడితో నటించే ఛాన్స్..
Anushka Shetty

Updated on: Jan 11, 2022 | 5:19 PM

Anushka Shetty: సూపర్ సినిమాతో ఎంట్రీఇచ్చిన బ్యూటీ అనుష్క. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకొని దూసుకుపోయింది ఈ బ్యూటీ. తక్కువ సమయంలోనే తెలుగులో బిజీగా హీరోయిన్ గా మారింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ కమర్షియల్ సినిమాతోపాటు లేడీ ఓరియెంటడ్ సినిమాలోతో అనుష్క విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో అనుష్ల్క క్రేజ్ దేశాలు దాటింది. బాహబలి సినిమాతర్వాత అనుష్క ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. బాహుబలి మూవీతర్వాత చేసిన బాగమతి సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత వచ్చిన నిశ్శబ్దం సినిమా నిరాశపరిచింది. ఆతర్వాత అనుష్క మరో సినిమాను ప్రకటించలేదు. దాంతో ఆమె సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఆతర్వాత గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీర్రాజు సినిమాలు చేస్తున్నారు చిరు. ఈ సినిమాల్లో నయనతార, తమన్నా, శ్రుతిహాసన్ హీరోయిన్స్ గా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలతర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కను సంప్రదిస్తున్నారట. ఇక వెంకీ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు వెంకీ కుడుముల.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: అల్లు అర్జున్ నిజంగా అదరగొట్టేశాడు .. పుష్ప సినిమా పై తమిళ్ స్టార్ హీరో కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

సినిమాతారలను వదలని మహమ్మారి.. వరుసగా కరోనా బారిన పడుతున్న మూవీ స్టార్స్.. ఆందోళనలో అభిమానులు

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?

Follow Us