Anupama Parameswaran : సినిమా తారలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే.. సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు మరింత చేరువగా ఉంటారు హీరోయిన్లు.. నిత్యం రకరకాల ఫోటోషూట్లతో.. సినిమా విశేషాలతో.. వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతే కాదు అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా లైవ్‌లో చిట్ చాట్ చేస్తూ..అభిమానులు అడిగే ప్రేక్షలకు సమాధానం ఇస్తూ ఉంటారు.. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు హీరోయిన్స్‌ను ఇబ్బందికర ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ప్రశ్నే ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కు ఎదురైంది. దానికి అనుపమ చెప్పిన సమాధానం వింటే దిమ్మతిరిగిపోతుంది.
అనుపమ పరమేశ్వరన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది.. ఈ క్రమంలో అభిమానులు ఆమెను పలు రకాల ప్రశ్నలు అడిగారు.. మీ కొత్త సినిమాలు ఏంటి ..?, ఏ హీరోతో కలిసి నటిస్తున్నారు..ఇలాంటి ప్రశ్నలు అడిగారు. వాటికి అనుపమ ఓపికగా సమాధానాలు చెప్తూ వచ్చారు.. అయితే ఓ నెటిజన్ మాత్రం కాస్త హద్దుమీరి ప్రవర్తించాడు. దాంతో అనుపమకు చిర్రెత్తుకొచ్చింది. మీరు బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేయండి అని అడిగాడు ఆ నెటిజన్. దానికి అనుపమ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. నీ అడ్రస్ పంపించు.. నేను ఫోటో పంపిస్తా.. ఫ్రేమ్ కట్టించి పెట్టుకో.. అంటూ ఘాటుగా జవాబిచ్చింది ఈ కేరళకుట్టి.. ఇక అనుపమ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. నిఖిల్ హీరోగా చేస్తున్న 18 పేజెస్ సినిమాలో అలాగే కార్తికేయ 2 సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అనుపమ.
మరిన్ని ఇక్కడ చదవండి :