తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran). మొదటి సినిమాతోనే ఆడియన్స్ మనసుకు చేరువైన ఈ హీరోయిన్.. ప్రస్తుతం కార్తికేయ 2 ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇటీవల హీరో సిద్ధార్థ్ తో కలిసి ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో పాల్గొంది. అంతేకాకుండా.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ కేరళ కుట్టి. ఓవైపు వరుస ప్రాజెక్ట్స్, మూవీ ప్రమోషన్స్ అంటూ క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ అమ్మడు.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా తన రాశి గురించి చెబుతూ.. వారికి ఉండే లక్షణాలను తెలిపింది.
కుంభరాశి వారికి ఉండే లక్షణాలు ఇవే అని.. తనది కూడా అదే రాశి అంటూ చెప్పుకనే చెప్పింది. ఈ రాశఇవారు ఎక్కువగా కేరింగ్ గా ఉంటారట. అంతేకాకుండా కొద్ది మందితోనే అత్యంత ప్రేమగా ఉంటారని.. ఇతరులను అంచనా వేయడంలో ఎప్పుడూ ముందుంటారట. అలాగే వీరు చాలా తెలివి పరులని.. ఏది ఏమైనా కూడా వెనక్కి తగ్గరని.. ముఖ్యంగా అబద్ధాలు సహించరని తెలిపింది. అబద్దాలు చెప్పేవారిని ఎక్కువగా ద్వేషిస్తారట. హైయిలీ ఇంటెలిజెంట్ అంటూ తన రాశివారికి ఉండే లక్షణాలను చెబుతూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.