
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ‘భోగి’. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. దయానంద్ రెడ్డి, రోహిత్ పాఠక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. గ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ భోగి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పలు ప్రమోషనల్ ఈవెంట్స్‌ను నిర్వహించింది. వరుస ఇంటర్వ్యూలతో పాటు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్, మ్యూజికల్ నైట్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమాల్లో శర్వానంద్, డింపుల్ లు మాత్రమే ప్రధానంగా కనిపించారు. అనుపమ జాడ అసలు కనిపించలేదు. దీంతో రకరకాల రూమర్లు వచ్చాయి. ‘భోగి’ సినిమా యూనిట్ తో అనుపమకు విభేదాలు వచ్చాయని, అందుకే చిత్ర ప్రమోషన్లకు దూరంగా ఉన్నారని కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్వయంగా అనుపమనే స్పందించింది. ఎందుకు తాను భోగి ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదో వివరిస్తూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది అనుపమ.
‘నవంబర్ 27న భోగి విడుదలవుతున్న సమయంలో చిత్రబృందంతో కలిసి ఉండాలని ఎంతో కోరుకున్నా. అయితే ఈ సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే క్రమంలో విడుదల తేదీలో పలుమార్లు మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో నా డేట్స్ కుదరలేదు. చిత్రబృందంతో కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ.. గతంలోనే అంగీకరించిన ఇతర సినిమా కమిట్మెంట్ల కారణంగా ఊటీలో ఉండాల్సి వచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించినందుకు భోగి చిత్రబృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయంలో మీతో కలిసి అక్కడ లేకపోవడం చాలా బాధగా ఉంది. నా మనసంతా అక్కడే ఉంది. మీరందరూ థియేటర్లలో భోగి సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అనుపమ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ తో తనకు చిత్ర బృందంతో విభేదాలు ఉన్నాయన్న రూమర్లను కొట్టి పారేసింది అనుపమ.
Anupama Parameswaran Post
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.