Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

|

Dec 31, 2021 | 8:47 PM

బ్యాట్ పట్టుకుని స్టైలిష్‌గా పోజిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.! అందం, అభినయంతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు...

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine
Follow us on

బ్యాట్ పట్టుకుని స్టైలిష్‌గా పోజిస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.! అందం, అభినయంతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసులు దోచుకుని.. వాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. గ్లామర్ షోకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

యువ హీరోల సరసన నటించి వరుస హిట్స్ అందుకుంది. ఈ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా.! లేదా ఓ చిన్న క్లూ ఇమ్మంటారా.. ఈ ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ. మలయాళంలో డెబ్యూ మూవీతోనే అన్ని సౌత్ భాషల్లోనూ ఈమె పేరు మారుమ్రోగింది. ఈపాటికి ఆమెవరో మీకు అర్ధమై ఉండొచ్చు. ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్.

 

‘ప్రేమమ్’ సినిమాతో మలయాళంలో డెబ్యూ చేసిన అనుపమ.. నితిన్ హీరోగా వచ్చిన ‘అఆ’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అనుపమ ‘ప్రేమమ్’ తెలుగు రీమేక్.. ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘రాక్షసుడు’ వంటి సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ‘రౌడీ బాయ్స్’, ’18 పేజీస్’, ‘కార్తికేయ 2’, ‘హెలెన్’ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..