
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘పళ్ళ బురుసు’ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించడం ఆకట్టుకుంది. ఈ వినూత్న విజువల్ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. క్షితిజ్ జీవన్ రంధీర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
What is Pallaburusu????
The questions end here… and the fun begins 😄👌🏻Presenting the First Look and Title Glimpse of 𝙋𝘼𝙇𝙇𝘼𝘽𝙐𝙍𝙐𝙎𝙐 ⚖️🪥
— https://t.co/sc4FK03CE6Witness a quirky entertainer that promises laughter, chaos & a lot more in Cinemas From AUG 14TH, 2026… pic.twitter.com/QGoZ7mfdZJ
— Annapurna Studios (@AnnapurnaStdios) July 17, 2026
వినూత్న కాన్సెప్ట్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘పళ్ళబురుసు’ నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచా, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Here’s the Title Glimpse of 𝙋𝘼𝙇𝙇𝘼𝘽𝙐𝙍𝙐𝙎𝙐 ⚖️🪥
— https://t.co/sc4FK03CE6Witness the humor, drama and emotions unfold in Cinemas From AUG 14TH, 2026 📽️🔥
Written and Directed by @dir_udaychauhan ✍🏻
Produced by @AnnapurnaStdios and @EPICStudiosMov ✨️#Pallaburusu… pic.twitter.com/rAHQKukd4p— Annapurna Studios (@AnnapurnaStdios) July 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.