Pawan Kalyan: పవన్‏తో ప్రేమ, పెళ్లి.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారో రివీల్ చేసిన అన్నా లెజినోవా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం అటు హీరోగా.. ఇటు డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు. మరోవైపు ఇటీవలే పవన్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యం తమ ఫ్యామిలీ, మెగా కుటుంబం గురించి ఆసక్తికర పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.

Pawan Kalyan: పవన్‏తో ప్రేమ, పెళ్లి.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారో రివీల్ చేసిన అన్నా లెజినోవా..
Pawan Kalyan, Anna Lezhinov

Updated on: Apr 09, 2026 | 7:32 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించరు. అయితే, తాజాగా ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన ఇన్ స్టా వేదికగా అభిమానులతో జరిపిన “ఆస్క్ మీ ఎనీథింగ్” సెషన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, పవన్ కళ్యాణ్‌తో ఉన్న ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

ఈ చిట్ చాట్ సెషన్‌లో ఒక అభిమాని అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “వదిన గారు.. మీ ఇద్దరిలో మొదటగా ఎవరు ప్రపోజ్ చేశారు? మీరా లేక పవన్ కళ్యాణ్ గారా?” అని ప్రశ్నించగా.. దీనికి అన్నా లెజినోవా ఎంతో సింపుల్‌గా, అంతే స్వీట్‌గా సమాధానమిచ్చారు. “మీ అన్నయ్యే (పవన్ కళ్యాణ్) మొదట ప్రపోజ్ చేశారు” అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరి పరిచయం ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. అక్కడ మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారి, చివరికి ఇరువురి అంగీకారంతో పెళ్లి వరకు వెళ్లిందని ఆమె పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

రష్యాకు చెందిన అన్నా లెజినోవా.. మెగా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత భారతీయ సంప్రదాయాలను, తెలుగు సంస్కృతిని ఎంతో గౌరవిస్తూ వస్తున్నారు. తనకు ఆరు భాషలు వచ్చునని, ప్రస్తుతం తెలుగు భాషను కూడా నేర్చుకుంటున్నానని ఆమె తెలిపారు. అంతేకాకుండా, తన అత్తమ్మ అంజనా దేవి దగ్గర తెలుగు వంటకాలు నేర్చుకున్నట్లు ఆమె వెల్లడించారు. దోశ, ఇడ్లీ, పప్పు, కూరలతో పాటు పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన మసాలా చికెన్ చేయడం కూడా నేర్చుకున్నానని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, అన్నా లెజినోవా ఇంటి బాధ్యతలను, పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఆయనకు వెన్నెముకలా నిలుస్తున్నారు. మొత్తానికి అన్నా లెజినోవా చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చాయి.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

Loading...
Unable to load recommendations.
Follow Us