Rashmi Gautam: వ్యాక్సిన్ వేయించుకున్న రష్మీ గౌతమ్.. కోవిడ్ రక్కసి నుంచి తమని తాము కాపాడుకోవాలన్న యాంకరమ్మ..

కోవిడ్ మహమ్మారి రోజు రోజుకు జడలు విప్పుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

Rashmi Gautam: వ్యాక్సిన్ వేయించుకున్న రష్మీ గౌతమ్.. కోవిడ్ రక్కసి నుంచి తమని తాము కాపాడుకోవాలన్న యాంకరమ్మ..

Updated on: May 11, 2021 | 7:22 PM

Rashmi Gautam: కోవిడ్ మహమ్మారి రోజు రోజుకు జడలు విప్పుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఇప్పటికే సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకుంటూ కోవిడ్ రక్కసి నుంచి తమని తాము రక్షించుకుంటున్నారు. అయితే రీసెంట్ గా బుల్లితెర స్టార్‌ యాంకర్‌ రష్మి గౌతమ్ కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుండడంతో రష్మి కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అంతేకాదు అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు. ఇక రష్మీ షార్ట్‌ ఫిల్మ్స్‌తో… తన కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆ తరువాత సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్లు చేస్తూ వచ్చారు. ఇక ఆ తరవాత టెలివిజన్‌ ఇండస్ట్రీలో కొత్త షోలు రూపుదిద్దుకుంటుండడంతో .. అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా ఎదిగారు. అంతేకాదు ఆ క్రేజ్‌ తోనే సినిమాల్లో హీరోయిన్‌గా మంచి అవకాశాలను పట్టేశారు రష్మి.

ఇక సోషల్ మీడియాలో తన అభిమానులందరినీ పలకరించే రష్మీ.. సామాజిక సేవా కార్యాక్రమాల్లో కూడా ముందున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వీధి కుక్కల ఆకలి తీరుస్తూ.. వాటి బాగోగులు చూస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక రష్మీ ఇటు యాంకరింగ్  చేస్తూనే అటు సినిమాల్లోను నటిస్తుంది. అందం అభినయంతో ఆకట్టుకునే రష్మీ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా…

Shahrukh Khan : రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న కింగ్ ఖాన్..

Selvaraghavan: సెల్వ రాఘ‌వ‌న్, ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో మూవీ..! కానీ ఇక్క‌డే క్రేజీ ట్విస్ట్

Follow Us