
అందాల యాంకరమ్మగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది అనసూయ. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతోన్న జబర్దస్త్ అనే కామెడి షో తో అనసూయకు మంచి పాపులారిటీ వచ్చింది.

ఆతర్వాత చాలా షోల్లో, ఇంటర్వ్యూల్లో, సినిమా ఫంక్షన్స్ లో కనిపించి మెప్పించింది అనసూయ. అలాగే సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది.

రంగస్థలం సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఈ భామ వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పటికే చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనసూయ.

ఇటీవలే ప్రేమ విమానం అనే సినిమాలో నటించింది. తెలుగు సినిమాలతో పాటు తమిళ్ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో అనసూయ ఫోటోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు నిరాశపడకుండా ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

వయసు మీదపడుతున్న కుర్రహీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా అందాలు వడ్డిస్తూ.. ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మత్తెక్కిస్తున్నాయి.