Amitabh Bachchan: 52 యేళ్ల సినీ ప్రస్థానం.. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ బిగ్ బీ ఎమోషనల్

|

Feb 16, 2021 | 9:35 AM

అమితాబ్ బచ్చన్ తన మొదటి చిత్రం 'సాత్ హిందుస్తానీ'పై సంతకం చేసి సోమవారంతో  52 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు.

Amitabh Bachchan: 52 యేళ్ల సినీ ప్రస్థానం.. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ బిగ్ బీ ఎమోషనల్
Follow us on

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ తన మొదటి చిత్రం ‘సాత్ హిందుస్తానీ’పై సంతకం చేసి సోమవారంతో  52 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్నేళ్లుగా అభిమానులు అమితమైన ప్రేమ చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 78 ఏళ్ల బాలీవుడ్ మెగాస్టార్ తన ఫిల్మ్ జర్నీని దర్శకుడు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ రూపొందించిన ‘సాత్ హిందుస్తానీ’ యాక్షన్-డ్రామాతో ప్రారంభించారు. అమితాజ్ ఫిబ్రవరి 15, 1969 న ఈ మూవీకి సైన్ చేశారు. ఈ చిత్రం తొమ్మిది నెలల తరువాత నవంబర్ 7 న విడుదలైంది.

గత ఐదు దశాబ్దాలుగా తన ప్రస్థానాన్ని వర్ణిస్తూ, అభిమాని చేసిన చిత్రాలతో చేసిన వీడియోను, బచ్చన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. “ఈ రోజునే నేను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాను. ఫిబ్రవరి 15, 1969. 52 సంవత్సరాలు గడిచిపోయాయి! అందరికీ  కృతజ్ఞతలు.” అని పేర్కొన్నారు.

Also Read:

రహదారిపై ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు.. ఐదుగురు దుర్మరణం.. మరో ఐదుగురు..

‘ప్రాణాలు అడ్డు వేసైనా కార్యకర్తలను రక్షించుకుంటా’.. హిందూపురంలో బాలయ్య ఎమోషనల్ కామెంట్స్