
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కు కొదువే ఉండటం లేదు. ఏ జోనర్ సినిమా అయినా సరే రొమాంటిక్ సీన్స్ పక్క ఉంటున్నాయి. కనీసం ఒక్క లిప్ లాక్ అయినా ఉండాల్సిందే.. ఇక రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి హీరోయిన్స్ కూడా వెనకాడటం లేదు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్స్ చేయడానికైనా హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటించారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి నగ్నంగాను నటించారు. ఇదిలా ఉంటే రొమాంటిక్స్ సీన్స్ లో నటించడం పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్ తమ ఒపీనియన్ ను తెలిపారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ రొమాంటిక్స్ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. వయసులో పెద్దవారితో రొమాన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
రొమాంటిక్స్, ఇంటిమేట్ సీన్స్ లో నటించడం పై చాలా మంది హీరోయిన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ ఇంటిమేట్ సీన్స్ లో నటించడం పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితురాలే. మహేష్ బాబు సరసన నాని, పవన్ కళ్యాణ్ తో బద్రి, ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాల్లో నటించి మెప్పించింది అమీషా. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది.
ఇక ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వీడియోలతో ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల బాలీవుడ్ లో సికిందర్ సినిమా విడుదలైంది డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలోకి రష్మిక, సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి పెద్ద చర్చే జరిగింది. కాగా హీరో హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి అమీషా పటేల్ మాట్లాడుతూ.. నేను కూడా నాకంటే ఏజ్ లో పెద్ద హీరోలతో నటించా.. గదర్-2’లో సన్నీ డియోల్ నాకంటే 20 ఏళ్లు పెద్దవారు. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను నచ్చింది. సికిందర్ సినిమాలోనూ రష్మిక, సల్మాన్ జోడీ బాగుంది. నాకు నచ్చింది. అని తెలిపింది. దాంతో ఈ బ్యూటీ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పెద్ద వారితో రొమాన్స్ చేయడం బాగుంటుందని అర్ధం వచ్చేలా ఆమె కామెంట్స్ చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.