Prabhas Salaar: ఇకపై ఇండియన్ సినిమా అంటే ఖాన్స్‌ రికార్డ్స్ గురించి కాదు.. ప్రభాస్ రికార్డ్స్ !

|

Mar 06, 2021 | 1:12 PM

బాహుబలి సినిమాతో ఇండియన్‌ సినిమా రికార్డ్‌లను తిరగరాసిన ప్రభాస్ ఇప్పడు బాలీవుడ్ టాప్‌ స్టార్స్‌కు కూడా చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే నేషనల్‌ లెవల్‌ డార్లింగ్ మేనియా

Prabhas Salaar: ఇకపై ఇండియన్ సినిమా అంటే ఖాన్స్‌ రికార్డ్స్ గురించి కాదు.. ప్రభాస్ రికార్డ్స్ !
Follow us on

బాహుబలి సినిమాతో ఇండియన్‌ సినిమా రికార్డ్‌లను తిరగరాసిన ప్రభాస్ ఇప్పడు బాలీవుడ్ టాప్‌ స్టార్స్‌కు కూడా చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే నేషనల్‌ లెవల్‌ డార్లింగ్ మేనియా ఓ రేంజ్‌లో ఉంది. బాహుబలితో ప్రభాస్‌ సెట్‌ చేసిన రికార్డ్‌ను కొట్టేందుకు ఇప్పటికీ బాలీవుడ్ మేకర్స్ తంటాలు పడుతూనే ఉన్నారు. తాజాగా కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు కూడా పోటి ఇస్తున్నారు మన డార్లింగ్‌.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమా ఇప్పుడు నేషనల్ లెవల్‌ బజ్‌ క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్ లాంటి బిగ్ హిట్ తరువాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ చేస్తున్న సినిమా కావటం, అది కూడా ప్రభాస్‌ లాంటి పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌తో కావటంతో సలార్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఇప్పట్నుంచే భారీ బిజినెస్‌ డీల్స్‌ కూడా వస్తున్నాయన్నది ఇండస్ట్రీ టాక్‌.

సలార్‌ సినిమా రైట్స్ విషయంలో కేవలం ఓటీటీకే 150 కోట్లకు పైగా ఆఫర్‌ చేసినట్టుగా నార్త్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్‌ సినిమాలో ఇదే బిగ్గెస్ట్ డీల్‌ అయ్యే ఛాన్స్ ఉందన్నది ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న మాట.

ఇప్పటి వరకు ఈ రికార్డ్ బాలీవుడ్ సూపర్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ పేరిట ఉంది. సల్మాన్ సినిమాలు బాలీవుడ్‌లో భారీ బిజినెస్‌ చేస్తున్నాయి. ఫ్లాప్‌ సినిమాలతో కూడా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రికార్డ్‌ సల్మాన్ సొంతం. ఇప్పటి వరకు ఓటీటీ ఢీల్స్ విషయంలోనూ సల్మాన్ సినిమాలే టాప్‌ రేంజ్‌ బిజినెస్‌ చేశాయి. దీంతో సల్మాన్ రాధే సినిమా అలాంటి రికార్డ్ సెట్ చేస్తుందని బాలీవుడ్ ఆడియన్స్ ఆశపడుతున్నారు.

కానీ ఆ ఆశల మీద ప్రభాస్ నీళ్లు చల్లేస్తున్నారు. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ ఇచ్చే సత్తాతో పాటు ప్రభాస్‌కు సౌత్‌ మార్కెట్‌లోనూ సాలిడ్‌ గ్రిప్‌ ఉండటంతో సల్మాన్‌ సినిమాలకు మించి డార్లింగ్ మూవీస్‌కి ఆఫర్స్ వస్తున్నాయన్నది విశ్లేషకుల మాట. మరి నిజంగానే ప్రభాస్‌ సలార్‌తో సల్మాన్ ప్లేస్‌కి ఎర్త్ పెడతారేమో చూడాలి.

Also Read:

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు

ఇవి ఒరిజినల్ బైసెప్స్ కావు.. అతిగా ఆలోచించాడు.. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు