
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్మగ్లర్ కమ్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‌లో బన్నీ అదరగొట్టాడు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించారు. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తాజాగా వందకోట్ల క్లబ్లో చేరిపోయింది. పుష్ప సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా.. వరుసగా పలు ప్రాంతాల్లో పుష్ప సక్సెస్ పార్టీ నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే ఈరోజు కాకినాడలో పుష్ప సక్సెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు చిత్రయూనిట్ నిన్న ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా దాదాపు పూర్తిచేసింది. అయితే పుష్ప సక్సెస్ మీట్ నిర్వహించేందుకు అనుమతులు రాకపోవడంతో ఆ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఇదిలా ఉంటే.. పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.
Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..
Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..
Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీవల్లి సాంగ్.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..
Prabhas: చిన్నపాటి దేవుడిలా ఉన్నారు.. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రబాస్ ఆసక్తికర కామెంట్స్..