
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వా…బన్నీ , సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో పుష్ప పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇటీవల సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఏర్పడిన గులాబ్ తుఫాన్ కారణంగా పుష్ప షూటింగ్ ఆగిపోయిందని.. దీంతో అనుకున్న సమయానికి మూవీ రిలీజ్ చేయడం కుదరదని వార్తలు వచ్చాయి. అలాగే అక్టోబర్ చివరి నాటికి సినిమా పూర్తవ్వడం కష్టమే అని.. దీంతో పుష్ప మూవీ ఆసారి రావడం కష్టమే అని నెట్టింట్లో టాక్ నడుస్తోంది. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టారు పుష్ప టీం మేకర్స్. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అనుకున్నట్లుగానే డిసెంబర్ 17న థియేటర్లలో పుష్ప సినిమాను విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే సెకండ్ సింగిల్ సాంగ్ షూట్ స్పాట్ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ఫజిల్ ఫాహద్ నటిస్తుండగా.. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది.
ట్వీట్..
Roja Daughter Anshu: ఎమ్మెల్యే రోజా తనయ అన్షుకు అరుదైన గౌరవం.. యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక