Allu Arjun: క్లాస్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టినా… తన ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మాస్ మూవీస్‌కే అంటున్నారు అల్లు అర్జున్. అందుకే అల వైకుంఠపురములో లాంటి ఫ్యామలీ డ్రామా తరువాత రా అండ్ రస్టిక్ పుష్ప సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో బన్నీ లుక్ స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పించింది. పుష్ప మాత్రమే కాదు.. ఆ తరువాత కూడా వరుసగా మాస్ డైరెక్టర్లకే ఓటేస్తున్నారు ఐకాన్ స్టార్. వకీల్ సాబ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో లాంగ్ డిలేడ్ ఐకాన్‌ను వెంటనే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తవ్వగానే బన్నీ చేయబోయే సినిమా ఇదే. ఆ తరువాత పుష్ప సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తారు. నెక్ట్స్ బోయపాటి, మురుగదాస్‌లలో ముందు ఎవరి స్క్రీప్ట్ ఫైనల్ అయితే.. ఆ సినిమా షూటింగ్ చేసేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్. కెరీర్‌లో ఒక్కసారి గ్యాప్ వచ్చినందుకే సీరియస్‌గా రియాక్ట్ అయిన బన్నీ.. ఇక మీద అలాంటి ఛాన్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఆల్రెడీ ఎనౌన్స్ అయిన కొరటాల సినిమా కూడా ఆన్ కార్డ్స్ అంటున్నారు మేకర్స్. కొరటాల ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయిన వెంటనే బన్నీతో సినిమా పక్కాగా ఉంటుందంటున్నారు ఏఏ ఆర్మీ. లెక్క అక్కడితో అయిపోలేదు. ఈ మధ్యే బన్నీని కలిసి ప్రశాంత్ నీల్ కూడా ఓ లైన్ వినిపించారు. అయితే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో ఇప్పటికిప్పుడు ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు రాకపోయినా.. ప్యూచర్‌లో మాత్రం ప్రశాంత్ కూడా బన్నీతో సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయటం గ్యారెంటీ అన్నది బన్నీ క్యాంప్ నుంచి వినిపిస్తున్నా మాట.
మరిన్ని ఇక్కడ చదవండి :