Allu Arjun : వైజాగ్‏లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం విశాఖపట్నంలో సందడి చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖ సమీపంలో ప్రారంభించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం సంతోషకరమని అన్నారు. విశాఖలోని ఇనార్పిట్ మాల్ లో AAA సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించిన బన్నీ.. అనంతరం మాట్లాడారు.

Allu Arjun : వైజాగ్‏లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ..
Allu Arjun Car

Edited By:

Updated on: Aug 10, 2026 | 6:31 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేశారు.. AAA మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ నుంచి.. ఇనార్బిట్ మాల్ కు వచ్చేవరకు అడుగడుగునా ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు.. అందుకు తగ్గట్టుగానే పోలీసులు భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. బన్నీ వైజాగ్ టూర్ లో వినియోగించిన కారుపై.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇటీవల రామ్ చరణ్ కూడా ఇదే కారులో తలుకుమన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

Allu Arjun

టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్ లు వినియోగించిన కారు పై ప్రస్తుతం సోషల్ మీడియాలో, అభిమానుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మంగళగిరి స్టేడియంలో జూన్ నెలలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ లో రాంచరణ్ ప్రయాణించిన ఏపీ 40 ఎల్ఈ 1 ల్యాండ్ క్రూయిజర్ కారు విశాఖలో తళుక్కుమంది. అదే కారులో ఆదివారం అల్లు అర్జున్ విశాఖ ఇన్ ఆర్బిట్ మాల్ లోని ఏఏఏ థియేటర్ల ప్రారంభోత్సవానికి రావడంతో ఆ కారు పై ఆరా తీస్తున్నారు నెటిజెన్లు, అభిమానులు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

Bunny Car

ఈ కారు మెగాస్టార్ చిరంజీవికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది. మెగా కుటుంబ సభ్యులెవరు విశాఖ వచ్చినా గంటా వారికి ఆత్మీయ ఏర్పాట్లు చేస్తుంటారు. “ఇద్దరు హీరోలు ఒకే కారులో ప్రయాణించారు. అనుబంధం అంతర్గతంగా ఎప్పుడూ ఉంటుంది. అభిమానులు ఫ్యాన్ వార్ లు పక్కన పెట్టాలి” అని సోషల్ మీడియాలో ఇద్దరు హీరోలు ప్రయాణించిన కారు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Loading...
Unable to load recommendations.
Follow Us