Tollywood: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టార్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. సినిమా పేరేటంటే?

David Warner Movie Robinhood: డేవిడ్ వార్నర్, ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్, "రాబిన్‌హుడ్" అనే తెలుగు సినిమాలో అతిధి పాత్రలో నటించాడు. నితిన్ నటించిన ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. వార్నర్ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ అభిమాని అయిన వార్నర్, ఈ సినిమా తన పాత్రను పూర్తి చేశాడు.

Tollywood: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టార్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. సినిమా పేరేటంటే?
David Warner Movie Robinhoo

Updated on: Mar 06, 2025 | 4:38 PM

David Warner Movie Robinhood: ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈసారి ఐపీఎల్‌లో కనిపించడం లేదనే సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకడిగా నిలిచిన సంగతి తెలిసిందే. అతను ఈ టోర్నమెంట్‌లో కనిపించకపోవచ్చు, కానీ భారతదేశానికి దూరంగా మాత్రం డేవిడ్ వార్నర్ ఉండలేకపోయాడు. వార్నర్ భారతీయ సినిమా అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో త్వరలోనే ఓ తెలుగు సినిమాలో అరంగేట్రం చేయబోతున్నాడు.

అల్లు అర్జున్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు..

వార్నర్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ అభిమాని. ‘బుట్ట బొమ్మా’ పాటలో ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ స్టెప్పులు చూసిన వారెవరూ ఇప్పటికీ మరచిపోలేరు. అలాగే, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళితో కలిసి ఒక ప్రకటనలో కూడా కనిపించిన సంగతి తెలిసిందే. దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’లో వార్నర్ అతిధి పాత్రలో నటించాడంట.

నిర్మాత కీలక ప్రకటన..

ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన వై రవిశంకర్ తాజాగా వెల్లడించారు. జి వి ప్రకాష్ హీరోగా నటించిన ‘కింగ్‌స్టన్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో, యాంకర్ తన రాబిన్ హుడ్ సినిమా గురించి నిర్మాతను అప్‌డేట్ అడిగాడు. దీనిపై రవిశంకర్ స్పందిస్తూ, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో అతిధి పాత్ర పోషించాడని అన్నారు. తన అనుమతి లేకుండా ఈ సమాచారాన్ని వెల్లడించినందుకు నిర్మాత వెంటనే దర్శకుడు వెంకీ కుడుములకు క్షమాపణలు చెప్పడం విశేషం. ‘రాబిన్ హుడ్’ తో డేవిడ్ వార్నర్‌ను భారతీయ సినిమాలోకి పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో వార్నర్ సందడి..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అనుబంధం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల అభిమానం పొందిన వార్నర్.. తెలుగు సినిమాలపై తరచుగా ప్రశంసలు గుప్పింస్తుంటాడు. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప’ పాటలకు డ్యాన్స్ చేయడంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింత బలోపేతం చేసుకున్నాడు. కాగా, సెప్టెంబర్ 2024లో ‘రాబిన్ హుడ్’ సినిమా ఆస్ట్రేలియా షెడ్యూల్‌లో వార్నర్ తన అతిధి పాత్ర పార్ట్‌ను కంప్లీట్ చేశాడని తెలుస్తోంది.

మార్చి 28న విడుదల..

ముందుగా రాబిన్‌హుడ్ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నారు, కానీ ఊహించని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఇది మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటించింది. ఆమె పుష్ప 2 లోని ‘కిసిక్’ పాటలో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..