Allu Arjun: అల్లు అర్హ బర్త్‌ డే స్పెషల్.. శ్రీలంకలో చిల్ అవుతోన్న అల్లు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి తగు సమయం కేటాయిస్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందులో భాగంగానే తాజాగా తన కూతురు అల్లు అర్హ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రిట్ చేశాడు బన్నీ. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Allu Arjun: అల్లు అర్హ బర్త్‌ డే స్పెషల్.. శ్రీలంకలో చిల్ అవుతోన్న అల్లు ఫ్యామిలీ.. ఫొటోస్ ఇదిగో
Allu Arjun

Updated on: Nov 25, 2026 | 2:50 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమార్తె అల్లు అర్హ 10వ పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబంతో కలిసి శ్రీలంకకు వెళ్లారు. తన కుమార్తె జీవితంలో ఈ స్పెషల్ బర్త్ డేని కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చేందుకు కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వెళ్లి శ్రీలంకలో వేడుకలను నిర్వహించారు. అర్హకు బర్త్ డే విషెస్ చెబుతూ అల్లు అర్జున్ షేర్ చేసిన స్పెషల్ ఫోటో, పెట్టిన క్యాప్షన్‌లో కురిపించిన ప్రేమ అందరినీ ఆకట్టుకున్నాయి. జాయ్ ఆఫ్ మై లైఫ్ అంటూ అల్లు అర్జున్ తన కూతురిపై ప్రేమను కురిపించారు. అర్హ పుట్టినరోజును ఘనంగా సెలెబ్రేట్ చేయాలని అల్లు అర్జున్ ప్లాన్ చేశారు. అందుకే అల్లు వారి సపరివారమంతా శ్రీలంకకు చేరుకుంది. ఈ ఏర్పాట్లను అల్లు అర్జున్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఒక ఫోటో తాజాగా బయటకు వచ్చింది. అందులో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విందును ఆస్వాదిస్తూ కనిపించారు. అల్లు వారి ఆత్మీయతను ప్రతిబింబించేలా ఆ ఫోటో ఉంది.

వృత్తిపరంగా అల్లు అర్జున్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబంతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. అలాగే జీవితంలో ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో వారి పక్కన ఉండటానికి ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుంటారు. అర్హ పుట్టినరోజును చిరస్మరణీయంగా మార్చేందుకు చేసిన ఈ ఏర్పాట్లు కుటుంబంపై అల్లు అర్జున్‌కి ఉన్న ప్రేమను, బాధ్యతను చాటి చెపుతున్నాయి. అర్హ తన పదో ఏట అడుగుపెడుతున్న తరుణంలో శ్రీలంకలో జరిగిన ఈ వేడుకలు అల్లు కుటుంబం మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని, జీవితంలోని ప్రత్యేక క్షణాలను ఇలా సెలెబ్రేట్ చేసుకునేందుకు వారు ఇచ్చే ప్రాముఖ్యతను అందంగా చాటిచెప్పాయి.

ఇవి కూడా చదవండి

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటున్నారు అల్లు అర్జున్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.

అల్లు అర్హ బర్త్ డే పార్టీలో అల్లు ఫ్యామిలీ..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us